టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ వల్ల మహిళలు బలవుతున్నారంటూ పెద్ద ఉద్యమమే చేపట్టింది శ్రీరెడ్డి. అయితే ఉద్యమం తీవ్రరూపం దాలుస్తుంది అని అనుకుంటున్న సమయంలో జనసేన అధినేతపై నోరుపారేసుకొని తన ఉద్యమానికి తానే శుభం కార్డు వేసుకొంది. అయితే అప్పుడు ఈమెపై తీవ్ర విమర్శలు రావడం, మద్దతు నిలిచిన వారే ఈమె మాటలకు వ్యతిరేకం అవడంతో చేసేదేమిలేక ఉద్యమానికి ప్రస్తుతం కామా పెట్టింది.


తన ఉద్యమం నీరుగారక ముందు న్యూస్  స్టూడియోలలో తెగ ఇంటర్వ్యూలు ఇచ్చిన ఈమె ఇప్పుడు మాత్రం ఇంటికే పరిమితమయింది. అప్పుడపుడు ఇండస్ట్రీలోని మహిళలు కీచకుల గురించి పోలీసుస్టేషన్లలో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే వారికి తోడుగా వెళ్తూ వార్తలలో నిలుస్తుంది. స్టూడియోలలో వెళ్లలేకపోతేనేమి ఎంచక్కా తన ఫేసుబుక్ పేజీలో ప్రముఖులపై స్పందిస్తూ నిత్యం ఏదో ఒక వివాదాన్ని సృష్టిస్తుంది.


తాజాగా ఆమె తన ఫేస్ బుక్ పేజీలో రాసుకొస్తూ-  "నిజాలు బయటపెట్టేందుకు మీడియా సైలెంట్ గా ఉండద్దు. మీడియా పీకే కి భయపడడం వల్ల జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. సురేష్ మామ అండ్ కో చేస్తున్న అన్యాయాలను ఎండగట్టండి. చిన్న నిర్మాతలు బాగుంటేనే 24 క్రాఫ్ట్స్, హీరోలు అందరూ బాగుంటారు. వాళ్లనే సురేష్ మామ అండ్ కో బ్రోకరైజ్ రూపంలో తినేస్తున్నారు" అంటూ మీడియా వారి గురించి రాయాలని కోరింది.


మరింత సమాచారం తెలుసుకోండి: