సినీ ఇండస్ట్రీలో హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు..తమ అభిమాన హీరో కోసం దేనికైనా సిద్దమనే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు.  కొన్ని సార్లు ఫ్యాన్స్ మద్య వచ్చే వివాదాలతో కొట్టుకోవడం..కొన్ని సార్లు హద్దులు దాటిన సంఘటనలు కూడా ఉన్నాయి.  అంతే కాదు తమ అభిమాన హీరో చిత్రం రిలీజ్ అవుతుందంటే చాలు..థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంటుంది..పెద్ద పెద్ద కటౌట్స్ పెట్టి నానా హంగామా చేస్తుంటారు.  ఇక హీరోల అభిమానులకు ఏదైనా జరిగిందంటే..తమ సొంత కుటుంబంలోని వారికి జరిగినంతగా బాధపడే హీరోలు కూడా ఉన్నారు.  వారు ఏదైనా కష్టాల్లో ఉంటే స్వయంగా వెళ్లి వారిని ఆదుకునే హీరోలు కూడా ఉన్నారు. 

తాజాగా అల్లు అర్జున్ హార్డ్ కోర్ ఫ్యాన్ దేవసాయి గణేశ్ అనారోగ్యంతో మృతి చెందాడు.  ఆ మద్య విశాఖపట్నం జిల్లాలోని అనాకపల్లిలో బోన్‌ కేన్సర్‌తో బాధితుడుతోన్న దేవసాయి గణేశ్‌ అనే యువకుడికి సినీనటుడు అల్లు అర్జున్‌ అంటే చాలా ఇష్టం. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోన్న దేవసాయి గణేశ్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో... తన అభిమాన నటుడు అల్లు అర్జున్‌ను చూడాలని, అదే తన చివరి కోరిక అని వైద్యులకి చెప్పాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న అల్లు అర్జున్ అనకాపల్లికి వెళ్లి దేవసాయి గణేశ్‌ ను పరామర్శించాడు.

బ్యాంకు ఖాతా నంబరు తన అభిమాన సంఘం ప్రతినిధులకు ఇవ్వాలని సూచించారు. గణేశ్‌ ఆరోగ్యం మెరుగుపడేందుకు 10లక్షలు అకౌంట్‌లో వేస్తానని అభయం ఇచ్చారు.
Image result for allu arjun sad
ఇదిలా ఉంటే..ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించి దేవసాయి గణేశ్ అనారోగ్యంతో మృతి చెందాడు. ‘సాయి గణేశ్ మృతి వార్త విని నా గుండె పగిలిపోయింది. అతని కుటుంబసభ్యులకు, సన్నిహితులకు నా సానుభూతి’ అని ఆ పోస్ట్ లో బన్నీ సంతాపం వ్యక్తం చేశాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: