తెలుగు ఇండస్ట్రీలో రాంగోపాల్ వర్మ అంటే కాంట్ర వర్సీలకు కేరాఫ్ అడ్రస్ అని చెబుతారు.  ఒకప్పుడు కామెడీ, మాఫియా, హర్రర్ తరహా చిత్రాలతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన వర్మ కొంత కాలంగా అట్టర్ ఫ్లాప్ చిత్రాలు తెరకెక్కిస్తూ...ఎన్నో అపజయాలు చవిచూశారు.  ఇదిలా ఉంటే ట్విట్టర్, ఫేస్ మాద్యమాలు వేదికగా చేసుకొని తన మనసులోని భావాలు ఏవైనా సరే అది సటైర్ గా వెల్లబుచ్చుతూ..ఎన్నో వివాదాలు సృష్టిస్తున్నారు. 
Image result for PAWAN KALYAN TIRUMALA
ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో మహష్, పవన్ కళ్యాన్ లాంటి హీరోలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ..ఫ్యాన్స్ ఆగ్రహానికి గురి అవుతున్నారు. మొన్న రవితేజ, పవన్ కళ్యాన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.  తాజాగా పవన్‌ తిరుమల పర్యటనకు సంబంధించిన ఓ ఫొటోను షేర్ చేసిన వర్మ.. పవర్ స్టార్‌ పవర్‌ఫుల్ ఎనర్జీకి ఒక ఉదాహరణ అంటూ కామెంట్ పెట్టాడు.
Image result for PAWAN KALYAN TIRUMALA
ఈ ఫోటోకి కౌంటర్ గా కి ప్రముఖ సినీ గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రి కౌంటర్ ఇచ్చాడు. ‘‘కెలకమాకు సామీ.. కాస్త వాతావరణం మర్చిపోతే ఆపని అందరూ చేయగలరు... ఇది మీకు హుందా అయినది కాదు. తెలుగు ప్రజల సమయం అంత తేలికగా లేదు. ఏమన్నా ఉంటే పర్సనల్ గా ఫోన్ చేసి మాట్లాడుకోండి’’ అంటూ కౌంటర్ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: