తన మనసుకు ఏమనిపిస్తే ఆవిషయం ఎటువంటి మొహమాటాలు లేకుండా బయటకు కామెంట్ చేసే రామ్ గోపాల్ వర్మ ఆమధ్య మారిపోతాను అంటూ తన తల్లి పై ఒట్టు కూడ పెట్టాడు. అయితే ఈవివాదాల దర్శకుడు ఎప్పుడూ మారడు అన్న విషయం ఈ మధ్య మరోసారి రుజువు అయింది. 
సంబంధిత చిత్రం
ఈమధ్యన శ్రీరెడ్డి వ్యహారంలో ఓపెన్ గా న్యూస్ లోకి వచ్చిన వర్మతీరును నిరససిస్తూ అతడిని టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి బహిష్కరించాలి అని ప్రయత్నాలు జరిగిన విషయం తెలిసిందే. అయితే దేనికి భయపడని వర్మ మరోసారి పవన్ ను కెలుకుతూ ట్విట్ చేసినా పవన్ అభిమానులు ఏమాత్రం స్పందించలేదు.
ఆడియో వేడుకలో పవన్
రవితేజ నటించిన ‘నేలటికెట్టు’ ఆడియో ఫంక్షన్ లో పవన్ రవితేజ తొడ మీద చేయివేసిన విషయాన్ని మరో యాంగిల్ లో బూతు అర్ధం వచ్చే విధంగా ఒక ట్విట్ చేయడంతో ఆ చౌకబారు ట్విట్ చూసి చాలామంది ఆశ్చర్య పోతున్నారు. అయితే ఇలాంటి సందర్భాలలో బాగా ఆవేశంగా స్పందించే పవన్ అభిమానులు మౌనంగా ఉంటే వారి తరుఫున ప్రముఖ సినీ గేయ రచయిత రామజోజయ్య శాస్త్రి విలక్షణంగా స్పందించారు.
 POET RAMAJOGAYYA SASTRY PHOTOS కోసం చిత్ర ఫలితం
‘కెలకమాకు సామీ’ అంటూ తెలుగువాళ్ల సమయం వృథా చేయొద్దని అంతగా ఏమైనా ఉంటే పవన్ కళ్యాణ్ కు పర్సనల్ గా ఫోన్ చేసి మాట్లాడుకోవాలని సుచిస్తున్నాడు ఈ విలక్షణ గేయ రచయిత. అయితే ఇంతకి రామజోగయ్యశాస్త్రి ఇలా పవన్ అభిమానుల తరుఫున వకాల్తా పుచ్చుకుని ఇలా రంగంలోకి ఎందుకు దిగాడు అన్న విషయం పై క్లారిటీ లేకపోయినా ఎవరి మాటలు సలహాలు వినని వర్మ రామజోగయ్యశాస్త్రి సలహాలు పాటిస్తాడా అన్నదేసమాధానం లేనిప్రశ్న..  

Ramajogaiah Sastry‏ @ramjowrites 12h12 hours ago
More
Ramajogaiah Sastry Retweeted Ram Gopal Varma
కెలకమాకు సామీ ...కాస్త వాతావరణం మర్చిపోతే ఆపని అందరూ చేయగలరు ...ఇది మీకు హుందా అయినది కాదు  తెలుగు ప్రజల సమయం అంత తేలికగా లేదు  ఏమన్నా ఉంటే పర్సనల్ గా ఫోన్ చేసి మాట్లాడుకోండి 



మరింత సమాచారం తెలుసుకోండి: