చిరంజీవి తెలుగు ఇండస్ట్రీ లో నెంబర్ వన్ స్టార్. అయితే 2008 లో పార్టీ పెట్టి విజయవంతం కాలేదు. దానితో రాజకీయాలకు స్వస్తి చెప్పి పూర్తి గా సినిమా ల మీదనే దృష్టి పెడుతున్నాడు. అయితే చిరంజీవి రాజకీయ ఎంట్రీ గురించి సీనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన విషయాలు ఇప్పుడు ఒక జర్నలిస్ట్ ద్వారా వెలుగు లోకి వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ 2008లో జరిగినా, అంతకు ముందు నుంచినే ఆయన పొలిటికల్ ఎంట్రీ గురించి ఊహాగానాలున్న సంగతి తెలిసిందే. 2004ఎన్నికల తర్వాత చిరంజీవి పొలిటికల్ ఎంట్రీకి ఊపు వచ్చింది.

Image result for chiranjivi

తెలంగాణ విభజన జరుగుతుంది.. ఆంధ్రలో ఇంద్ర పార్టీ ఏర్పడుతుందని మీడియా సర్కిల్స్ లో ప్రచారం మొదలైంది. వైఎస్ సీఎంగా ఉండటంతో పచ్చ పత్రికలు ఇలాంటి వార్తలు రాయసాగాయి. అయితే తెలంగాణ విడిపోలేదు కానీ, ఏపీలో ఇంద్ర పార్టీ రావడం.. ఫెయిల్యూర్ కావడం జరిగింది. అయితే 2004 ముందు నుంచి కూడా చిరంజీవి రాజకీయ ఆరంగేట్రానికి సంబంధించిన ఊహాగానాలున్నాయి.

Image result for chiranjivi

అవి 1994 నాటికే పీక్స్‌కు చేరిన వైనాన్ని ఒక సీనియర్ జర్నలిస్టు తాజాగా ఓక యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో వివరించడం ఆసక్తిదాయకంగా ఉంది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడిన ఆ సీనియర్ జర్నలిస్టు చిరంజీవి సినిమాలకు ఊపు తెచ్చేందుకు పొలిటికల్ ఎంట్రీ అనే ప్రచారాన్ని తెచ్చేవారని చెప్పాడు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ గురించి ఊహాగానాలు వచ్చాయన్నారు. అయితే జర్నలిస్ట్ఎన్టీఆర్ తో తను మాట్లాడాను అని, చిరు పొలిటికల్ ఎంట్రీ గురించి అడిగినట్టుగా పేర్కొన్నాడు. అప్పుడు ఎన్టీఆర్ స్పందిస్తూ.. ‘‘అబ్బే.. నేను ఉన్నంత వరకూ చిరంజీవి పార్టీ పెట్టను అన్నాడు. నాకు ఆ విషయాన్ని చెప్పాడు. వారు నాకు ఫ్యాన్..’’ అని అన్నాడట

మరింత సమాచారం తెలుసుకోండి: