ఈ మద్య సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు సంబంధించిన ఏ చిన్న విషయం కూడా వెంటనే వైరల్ అవుతుంది..ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ మారిపోతున్నాయి.  ఇక హీరో, హీరోయిన్ల ఎఫైర్ల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో  నటుడిగా, దర్శకుడిగా ప్రభుదేవకు ఎంతో క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. 
Image result for prabhu deva nayanthara
తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో తనదైన మార్క్ చాటుతున్న ప్రభుదేవ ను ‘కొమరం పులి’ సినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా నటించిన నికీషా పటేల్ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  దీంతో ఆమెను ప్రతి ఒక్కరూ ప్రభుదేవతో మీ పెళ్లి ఎప్పుడు? అని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో నికీషా తన పెళ్లి వ్యాఖ్యలపై స్పష్టత ఇవ్వక తప్పలేదు. 

Related image

ఆ మద్య ప్రభుదేవపై తాను చేసిన వ్యాఖ్యలపై ఇంత ప్రభావం పడుతుందని అనుకోలేదని..అసలు ప్రభుదేవనే కాదు.. ఎవ్వరినీ పెళ్లి చేసుకోవడం లేదు. ఆయన నాకు మంచి ఫ్రెండ్, శ్రేయోభిలాషి  ప్రభుదేవాను ‘సార్’ అని తాను పిలుస్తానని స్పష్టం చేసింది.  కొమరం పులి’ చిత్రం ద్వారా టాలీవుడ్ కు నికీషా పరిచయమైంది. ‘ఓమ్’, ‘అరకురోడ్డు’, ‘గుంటూరు టాకీస్ 2’ చిత్రాల్లో నటించింది. తెలుగు చిత్రాల్లోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళం చిత్రాల్లోనూ నికీషా నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ మూవీ ‘తేదీ మెహర్బానియా 2’ అనే చిత్రంలో నటిస్తోంది.

Image result for prabhu deva

గతంలో ప్రభుదేవ, నయన తార మద్య లవ్ ఆఫైర్ పెళ్లి వరకు వచ్చింది..కానీ అనుకోని కారణాల వల్ల వీరి మద్య దూరం పెరగడం..బ్రేకప్ చెప్పుకోవడం జరిగింది.  ఆ తర్వాత తమన్నాతో ఎఫైర్ ఉందని వార్తలు వచ్చినా..ఆ విషయంపై తమన్నా క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం నికీషా పటేల్ వ్యవహారంపై ప్రభుదేవ ఎలా స్పందించనున్నారో తెలియాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: