71వ అంతర్జాతీయ కేన్స్‌ చలన చిత్రోత్సవ వేడుక వేదికపై 17వ సారి భారత విశ్వసుందరి ఐశ్వర్యరాయ్   బచ్చన్ “బట్టర్ ఫ్లై కాన్సెప్ట్ డ్రెస్స్” లో అమెకే స్వంతమైన వన్నె చిన్నెల సౌందర్యం వెలుగులీనింది.   చిత్రోత్సవ వేడుక అట్టహాసంగా జరుగుతోంది. హాలీవుడ్‌, బాలీవుడ్ నటీనటులు కళ్లు చెదిరిపోయే వస్త్రాలంకరణలతో ఎర్ర తివాచీపై హోయలొలికిస్తున్నారు. తమ సోయగాల సౌదర్యాన్ని పరిమాళలను గుభాళిస్తున్నారు.
aishwarya dress designer michel sansko కోసం చిత్ర ఫలితం
ఎంతమంది వచ్చినా, అభిమానులు ఎదురుచూసేది మాజీ భారత ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌ కోసమే. కేన్స్‌ జ్యూరీ సభ్యురాలిగా, ఫ్రెంచ్‌ జెయింట్ కాస్మెటిక్‌ బ్రాండ్‌ 'లారియల్‌' కు  బ్రాండ్ అంబాసడర్ గా 17ఏళ్ల నుంచి విశ్వంలోనే అతిపెద్ద ఫ్యాషన్‌ వేడుకకు హాజరవుతూ వస్తున్నారు. గత 17యేళ్ళ నుండీ సౌందర్య అరాధకుల అందరికీ నిరీక్షణకు గమ్యమొకటే “ఎర్ర తివాచిపై మన నీలికళ్ళ సుందరి” వేసుకొని పరెడ్ చేసే డ్రెస్ ఏమిటా? అనేదే. 


ఎప్పటిలాగే ఈ ఏడాది ఐష్‌ ఎలాంటి దుస్తుల్లో కనువిందు చేయబోతున్నారా?   అని కేన్స్‌ సభ్యులతో పాటు అభిమానులూ ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. వారి అంచనా లకు తగ్గట్టుగానే ఐష్‌ ‘సీతాకోక చిలుక’లా ఎర్రతివాచీపై నడయాడారు. 
most beautiful aishwarya and aradhya at Canes కోసం చిత్ర ఫలితం
ప్రముఖ ఫ్రెంచ్‌ డిజైనర్‌, దుబాయ్‌కి చెందిన 'మైఖేల్‌ సాన్కో' డిజైన్‌ చేసిన సీతాకోక చిలుక ఆకృతి గౌనులో ముచ్చటగా ముస్తాబై, ముచ్చటగొలిపారు.  ఇంతటి అందమైన గౌనును డిజైన్‌ చేయడానికి ఆ డ్రస్ రూపకర్తలకు ఏకంగా 3,000 గంటలు పట్టిందట. అంటే దాదాపు 125 రోజులు. అది కూడా నిరంతరం నిర్విరామంగా శ్రమిస్తే కానీ, ఈ గౌను డిజైన్‌ పూర్తవ్వలేదట. డిజైన్‌తో పాటు అద్భుతమైన బ్రాండ్  'స్వరోవ్‌-స్కీ- రాళ్లు'  పొదగడంతో ఈ గౌనుకు మరింత అందం, నిండుదనం  వచ్చింది. 
సంబంధిత చిత్రం
"గొంగళి పురుగు నుంచి అందమైన సీతాకోక చిలుక గా మారి అరచేతికి అంద కుండా గాల్లో విహరించే,  ఒక రంగు రంగుల కల లాంటి, మధురస్వప్నం  మన కనుల ముందు ప్రతిబింబించాలని ఈ గౌను రూపొందించా. ప్రతి అమ్మాయి తన కలను సాకారం చేసుకొని అందులో విహరించాలి’’  అని మైఖేల్‌ సింకో పేర్కొన్నారు.
aishwarya dress designer michel sansko కోసం చిత్ర ఫలితం
ఐశ్వర్య కేన్స్‌కు వచ్చే ప్రతీసారి మైఖేల్‌, అతని బృందం ఆమెతో, ఆమె టీం తో కలిసి పనిచేస్తారు. ఐశ్వర్య ధరించే ప్రత్యేక సందర్భాల దుస్తుల విషయంలో డిజైనర్లు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎలాంటి డిజైన్లు వేస్తే బాగుంటుంది?  ఐష్‌ కూడా వారికి సహకరిస్తూ సలహాలిస్తూ వారికి సాయం చేస్తుంటారు.
సంబంధిత చిత్రం
ఈ వేడుకకు ఐశ్వర్య మరోసారి తన గారాలపట్టి ఆరాధ్యతో కలిసి వచ్చారు. తన తల్లికి తగ్గట్టుగానే ఆరాధ్య ఎరుపు రంగు గౌనులో అందరి దృష్టిని ఆకర్షించింది. కేన్స్‌లో అతి చిన్న సెలబ్రిటీగా ఆరాధ్య పేరు మారుమోగిపోతోంది.
 Aishwarya Rai At Cannes 2018 Red Carpet - Sakshi

మరింత సమాచారం తెలుసుకోండి: