రంగరంగ వైభవంగా మార్చి ౩౦న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుకుమార్ రాం చరణ్ సినిమా "రంగస్థలం" చిత్రం 'నాన్ బాహుబలి రికార్డులూ అన్నింటినీ బ్రేక్ చేసి దూసుకెళ్తున్ ది ఇప్పటికి కూడా. అసాధారణ విజయం దక్కించుకొని ఇప్పటికీ థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. అయితే ఈ సినిమా ఇంతటి విజయం సాధిస్తుందని ముందుగా ఊహించని చిత్ర నిర్మాతలు 'డిజిటల్ రైట్స్' ను 'అమెజాన్ ప్రైమ్'కు విక్రయించారు.  వారి ఒప్పందం ప్రకారం సినిమా విడుదలైన నలభై ఐదు రోజుల తరువాత ఆన్ లైన్ లో సినిమాను పెట్టేసుకోవచ్చు.
సంబంధిత చిత్రం
నిన్న ఆదివారానికి సినిమా విడుదలై 44రోజులయింది. ఇప్పటికీ సినిమా థియేటర్లలో దీని విజయ యాత్రకు బ్రేక్ పడలేదు. హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఇంత మంచిగా ఇంతకాలం బాహుబలి తప్ప మరే సినిమా కలక్షణ్ల పరంగా సైతం ఆడుతున్న ఈ సినిమాను ఆతృతగా ఆన్-లైన్ లో విడుదల చేయడం గర్హనీయం కాదని ఇలా చేశారు ఏమిటని అభిమానులు నిర్మాతలపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
rangasthalam movie hd photos కోసం చిత్ర ఫలితం
కనీసం పదివారాల పాటైనా థియేటర్లో విజయవంతంగా నడుస్తున్న సినిమాను, ఆన్-లైన్ లో చూపెట్టటం ఏమాత్రం మంచిది కాదని అభిమానులు అంటున్నారు.నిర్మాత లు కూడా 'అమెజాన్ ప్రైమ్' ని కొంతకాలం ఆగి ఆన్-లైన్ లో టెలికాస్ట్  చేయాలని కోరినా వారు అందుకు అంగీకరించకుండా ఒప్పందం ప్రకారమే నడుచుకుంటామని మార్పు చేయ లేమని చెప్పేశారట. ఇక చేసేదేమీ లేక నిర్మాతలు నిశ్శబ్ధంగా ఉండిపోయారు. 
సంబంధిత చిత్రం
ఇప్పటి నుండైనా కాస్త ప్రజలుమెచ్చే కంటెంట్ ఉన్న సినిమాల  'డిజిటల్ రైట్స్' సినిమా విడుదలైన తరువాత నిర్మాతల నిర్ణయం ప్రకారం ఆన్-లైన్లో టెలికాస్ట్ చేయాలని ఒప్పందంలోనే చేసుకునే ఏర్పాట్లు చెసుకుంటే మంచిదని కొందరు సినిమా ప్రేక్షక అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 

rangasthalam movie hd photos కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: