‘భరత్ అనే నేను’ సక్సస్ ను ఎంజాయ్ చేస్తున్న మహేష్ ప్రస్తుతం యూరప్ లో తన వికేషన్ కొనసాగిస్తున్నాడు. ఇక ఈ ఆనందానికి త్వరలో బ్రేక్ ఇచ్చి ఈనెలలో అమెరికాలో ప్రారంభం కాబోతున్న వంశీ పైడిపల్లి మూవీ షూటింగ్ కు రాబోతున్నాడు. అయితే మహేష్ కెరియర్ లో మైయిల్ స్టోన్ గా మారబోతున్న ఈ 25వ సినిమాకు సంబంధించి ఒక డిఫరెంట్ మేకోవర్ మహేష్ లో చూపెట్టాలని దర్శకుడు వంశీ పైడిపల్లి చేసిన ప్రయత్నాలకు మహేష్ నో చెప్పినట్లు సమాచారం. 
MAHESH LATEST PHOTOS IN BHARATH ANE NENU MOVIE కోసం చిత్ర ఫలితం
మహేష్ కెరియర్ లో ఇప్పటి వరకు నటించని ఒక మాస్ తరహా పాత్రను ఈమూవీలో నటిస్తున్న నేపధ్యంలో మహేష్ గుబురు మీసంతో కూడిన గడ్డంతో కనిపిస్తే బాగుంటుందని వంశీ పైడిపల్లి సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఈసూచనలను మహేష్ సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. 
MAHESH LATEST PHOTOS IN BHARATH ANE NENU MOVIE కోసం చిత్ర ఫలితం
అమెరికాలో  ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకునే ఈమూవీలో మహేష్ ఒక ఎన్ఆర్ఐ గా కనిపించబోతున్నాడు. అయితే మహేష్ ఈమూవీలోని పాత్ర రీత్యా కొంచం మాస్ లుక్ తో పాటు డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో నటించవలసి ఉంటుంది. దీనితో మహేష్ లుక్ కు గుబురు గడ్డం బాగా బాగుంటుందని వంశీ పైడిపల్లి భావిస్తున్నట్లు తెలుస్తోంది. 
MAHESH LATEST PHOTOS IN BHARATH ANE NENU MOVIE కోసం చిత్ర ఫలితం
దీనికితోడు ‘భరత్ అనే నేను’ మూవీలో ఒక సీన్ లో మహేష్ మీసంతో కనిపించిన నేపధ్యంలో ఆ లుక్ ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసారు. దీనితో మహేష్ ను పూర్తిగా గుబురు మీసం గడ్డంతో చూపించాలి అన్న ఆలోచన వంశీ పైడిపల్లికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి మహేష్ ఈసూచనను తిరస్కరించినా ఏదోవిధంగా మహేష్ ను గుబురు గడ్డంతో నటించే విషయంలో ఒప్పించాలి అని వంశీ పైడిపల్లి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: