తెలుగు ఇండస్ట్రీలో ఒకటీ రెండు చిత్రాలతో మంచి ఫామ్ లోకి వచ్చిన హీరో విజయ్ దేవరకొండ. మనోడు నటించిన ‘పెళ్లిచూపులు’ మంచి విజయం సాధించడం..ఆ తర్వాత సందీప్ వంగ దర్శకత్వంలో ‘అర్జున్ రెడ్డి’ బ్లాక్ బస్టర్ కావడంతో క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.  తెలుగు ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ మినిమం గ్యారెంటీ హీరోగా అంటున్నారు.  ఈ మద్య రిలీజ్ అయిన ‘మహానటి’ లో సమంత తో కలిసి విజయ్ ఆంటోనిగా అద్భుతంగా నటించాడు. 
Image result for taxiwala vijay devarakonda
ఎక్కువ శాతం తన నటనలో నేచురాలిటీ చూపించే విజయ్ దేవరకొండ తాజాగా ‘టాక్సీ వాలా’ చిత్రంలో నటించారు. రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
Image result for taxiwala vijay devarakonda
సైంటిఫిక్ థ్రిల్లర్ గా ఈ కథ కొనసాగుతుంది. ఈ సినిమాను ఈ నెల 18వ తేదీన విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ఆ రోజున ఈ సినిమా థియేటర్లకు రావడం లేదని విజయ్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఈ సినిమాకి సంబంధించిన పనులు ఇంకా పూర్తి కాలేదనీ, అందువలన విడుదల తేదీని వాయిదా వేయవలసి వచ్చిందని అన్నాడు.
Image result for taxiwala vijay devarakonda
జూన్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామనీ, తేదీ ఎప్పుడనేది త్వరలో ప్రకటిస్తామని చెప్పాడు. గీతా ఆర్ట్స్ 2 .. యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి.. ఈ సినిమాలో మాళవిక శర్మ, ప్రియాంక కథానాయికలు. రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: