సుకుమార్ డైరక్షన్ లో రాం చరణ్ చేసిన రంగస్థలం సినిమా చరణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాదు స్టార్ గా రాం చరణ్ ను పది మెట్లు పైకి ఎక్కించేసింది. చిట్టిబాబుగా కమిట్మెంట్ ఉన్న నటుడిగా చరణ్ తన సత్తా చాటాడు. ఇక ప్రస్తుతం ఆ హిట్ జోష్ లోనే బోయపాటి శ్రీను సినిమా షూటింగ్ చేస్తున్నాడు చరణ్.


బోయపాటి శ్రీను సినిమా అంటే ఇక యాక్షన్ హై ఓల్టేజ్ అని అందరికి తెలిసిందే. స్టార్ హీరోల సినిమాలు బోయపాటి డైరక్షన్ లో అంటే ఫ్యాన్స్ పండుగ చేసుకోవడం ఖాయం. రెగ్యులర్ యాక్షన్ సీక్వెన్సెస్ కు డిఫరెంట్ గా గూస్బంస్ వచ్చేలా చేస్తాడు. ఇక చేస్తున్న చెర్రి సినిమా గురించి ఓ సెన్సేషన్ న్యూస్ ఫిల్మ్ నగర్ లో చెక్కర్లు కొడుతుంది.


సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తుందని తెలియడంతో ఈ సినిమాను ఇంద్రకు సీక్వల్ అంటూ పోల్చుతున్నారు. గోపాల్ డైరక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా అప్పట్లో బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఆ సినిమా రిఫరెన్స్ తోనే బోయపాటి చరణ్ సినిమాను చేస్తున్నాడని అంటున్నారు.


ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కాని రంగస్థలం తర్వాత చరణ్ మళ్లీ అదే రేంజ్ హిట్ కొట్టేందుకు కృషి చేస్తున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి మల్టీస్టారర్ సినిమా కూడా చరణ్ లైన్ లో పెట్టాడు. ఈ రెండు మూడేళ్లు మెగా పవర్ స్టార్ ఫాం ఎవరు ఆపలేరన్నట్టు పరిస్థితులు ఉన్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: