నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో కళ్యాన్ రామ్.  హీరోగా, నిర్మాతగా తన సత్తా చాటుతున్నాడు.  ఆ మద్య ఎమ్మెల్యే సినిమాతో విజయం అందుకున్న కళ్యాన్ రామ్ ‘నా.. నువ్వే’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణం లో, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సమర్పణ లో, నందమూరి కళ్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా, అందాల భామ తమన్నా హీరోయిన్ గా, ప్రఖ్యాత యాడ్ ఫిలిం మేకర్ జయేంద్ర దర్శకత్వం లో రూపొందిన చిత్రం “నా.. నువ్వే. 

నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 24వ తేదిన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కాగా, ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్, టీజర్ తో పాటు ఒక్కో వీడియో సాంగ్ రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సిద్దం అయ్యింది.  తాజాగా  ఈ చిత్రం లోని నిజమా.. మనసా సాంగ్ లిరిక‌ల్ వీడియోని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సాంగ్ ను యాజిన్ నిజార్, మానసి ఆల‌పించారు..ఆనంత శ్రీ‌రామ్ సాహిత్యం అందించాడు.. ష‌రేత్ సంగీతం స‌మ‌కూర్చాడు.. తాజాగా విడుద‌లైన ఈ సాంగ్ మీరూ చూడండి.


ఈ చిత్రం లో కళ్యాణ్ రామ్, తమన్నా, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిశోర్, ప్రవీణ్, బిత్తిరి సత్తి, ప్రియ, సురేఖ వాణి ప్రధాన నటులు.
ఈ చిత్రానికి నిర్మాతలు : కిరణ్ ముప్పవరపు , విజయ్ వట్టికూటి, సమర్పణ : మహేష్ ఎస్ కోనేరు , సంగీతం: షరెత్ , సినిమాటోగ్రఫీ: పి. సి. శ్రీరామ్ , ఎడిటింగ్‌: టి. ఎస్. సురేష్ , కథ, స్క్రీన్‌ప్లే – జయేంద్ర, శుభ, దర్శకత్వం: జయేంద్ర


మరింత సమాచారం తెలుసుకోండి: