అవునా..తెలుగు ఇండస్ట్రీలో సినీ నటి సావిత్రి జీవిత కథపై బయోపిక్ తీస్తున్నారా..గతంలో ఇలాంటి ప్రయోగాలు ఎవ్వరూ చేయలేదు..మరి ఆ యంగ్ డైరెక్టర్ చేయడం నిర్మాతలు చేతులు కాల్చుకోవడం ఖాయం అంటూ ఎద్దేవా చేశారు..మహానటి చిత్రం తీసే ముందు. కానీ దర్శకులు నాగ్ అశ్వన్ ఇవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లారు.  అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ గురించి ఎంతో రీసర్చ్ చేసి ‘మహానటి’ చిత్రాన్ని తెరకెక్కించారు. 
Image result for mahanati
మహానటి సావిత్రి పాత్రలో నటి కీర్తి సురేష్ నటించగా..జెమినీ గణేషన్ పాత్రలో దుల్కన్ సల్మాన్ నటించారు. ‘మహానటి’ చిత్రం రిలీజ్ కి ముందు తెలుగు స్టార్ హీరోలు రాంచరణ్ నటించిన ‘రంగస్థలం’ , మహేష్ నటించి ‘భరత్ అనే నేను’, అల్లు అర్జున్ నటించిన ‘నా పేరు సూర్య’ చిత్రాలతో పోటీగా ‘మహానటి ’ రిలీజ్ అయ్యింది.  దాంతో ఈ చిత్రం కలెక్షన్లు రాబడుతుందా అని అనుమానాలు వ్యక్తం చేశారు.
Image result for mahanati
కానీ అందరి అంచనాలు తారుమారు చేస్తూ..కలెక్షన్లలో దూసుకు పోతుంది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్‌ నటన, అలనాటి చిత్రాల జ్ఞాపకాలు, సాంకేతిక నిపుణుల ప్రతిభ మహానటి చిత్రాన్ని మరుపురాని సినిమాగా మలచాయి. మహానటి జీవిత కథను ఎంతవరకు, ఎలా చెబితే బాగుంటుందో అని నాగ్‌ అశ్విన్‌ చేసిన ఆలోచన ఫలించింది. ఈ యువ దర్శకుడి ప్రతిభకు అన్నిచోట్లా ప్రశంసలు దక్కుతున్నాయి.
Image result for mahanati
తొలివారం మహానటి దాదాపు 60 కోట్ల రూపాయల వసూళ్లు సాధించే అవకాశముంది. ఓవర్‌సీస్‌లో 1.5 మిలియన్‌ డాలర్‌ల వసూళ్లు రాబట్టిందీ చిత్రం. మహానటికి దక్కుతున్న ప్రేక్షకాదరణ చూస్తుంటే….టాలీవుడ్‌లో మరో 200 కోట్లరూపాయల చిత్రంగా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: