రాజకీయాల నుండి సినిమాల వరకు ఎవరు ఆరంగాలలో రాణించాలి అన్నా పరోక్షంగా కులం ప్రభావితం చేస్తుంది అన్నది ఓపెన్ సీక్రెట్. కులం ప్రస్తావన బయటపడకపోయినా ఎదో ఒక సందర్భంలో ఎంతటి గొప్పవ్యక్తి అయినా కులం చట్రం నుండి బయటకు రాలేకపోతున్న పరిస్థితి. 
సంబంధిత చిత్రం
ఇలాంటి పరిస్థుతులలో ప్రస్తుతం సంచలనాలు సృష్టిస్తున్న ‘మహానటి’ మూవీ గురించి చాలామంది పోగుడుతూనే మరొకపక్క అలనాటి ‘మహానటి’ సావిత్రి కులం ఏమిటి అంటూ కొందరు పరిశోధనలు చేస్తున్న విషయం లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చింది. ఆశ్చర్యకరమైన ఈన్యూస్ వివరాలలోకి వెళితే కొన్ని షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. 36 సంవత్సరాల క్రితం చనిపోయిన సావిత్రిది ఏకులం అంటూ కొందరు సోషల్ మీడియాలో సెర్చ్ చేయడమే కాకుండా ఆమె కుటుంబ నేపధ్యం గురించి ఇప్పుడు ‘మహానటి’ సూపర్ హిట్ అయిన తరువాత చర్చలు జరుగుతున్నాయి. 
సంబంధిత చిత్రం
దీనికి కారణం ‘మహానటి’ విడుదలయ్యాక చాలామందికి వస్తున్న సందేహాలు. సావిత్రి తల్లిదండ్రుల ఇంటిపేరు నిశ్శంకరం. తండ్రి నిశ్శంకరం గురవయ్య తల్లి సుభద్రమ్మ సామాజిక వర్గం రీత్యా వారు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. అయితే ‘మహానటి’ సినిమాలో సావిత్రి పెదనాన్న పాత్రను పోషించిన రాజేంద్రప్రసాద్ ను చౌదరిగారు అంటూ పిలవడం వినిపిస్తుంది. దీనితో సావిత్రిని చాలామంది కమ్మ సామాజిక వర్గ ఖాతాలో వేసారు. అయితే సావిత్రి బాబాయ్ చౌదరి అయినప్పుడు సావిత్రి కాపు ఎలా అవుతుంది అని చాలామంది పరిశోధన మొదలు పెట్టారు. 
SAVITRI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే వాస్తవానికి సావిత్రి పెద్దమ్మది ప్రేమ వివాహం. ఆమె చౌదరిని ప్రేమించి పెళ్లాడింది. దీనితో ఈ కన్ఫ్యూజన్ ఏర్పడి సావిత్రి ఏసామాజిక వర్గానికి చెందిన నటి అంటూ చర్చలకు తెర లేచాయి. అయితే ఆమె మరణించిన తరువాత 36 సంవత్సరాలకు అది కూడ ‘మహానటి’ సూపర్ సక్సస్ అయిన తరువాత కొందరు సోషల్ మీడియాలో ఇలాంటి చర్చలకు తావిస్తున్నారు అంటే మరో 200 సంవత్సరాలు గడిచి పోయినా మన భారతదేశంలో ఈ కుల ప్రస్తావన పోదు అని ఎవరికైనా అర్ధమయ్యే విషయం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: