తెలుగు ఇండస్ట్రీలో అలనాటి అందాల తారలు సావిత్రి, జమున ల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో నటిస్తూ..ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించారు.  ఇండస్ట్రీలో సావిత్రి, జమున ల మద్య ఎంతో అన్యోన్యత అనుబంధాలు ఉండేవని..సావిత్రిని జమున అక్కయ్య అని పిలిచేవారని ఆ మద్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు జమున.   అంతే కాదు వీరిద్దరూ కలిసి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో కలిసి నటించారు.  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రంగస్థలం, భరత్ అనే నేను చిత్రాల తర్వాత ఆ రేంజ్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది ‘మహానటి’ చిత్రం. 
Image result for mahanati
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అలనాటి అందాల తార సావిత్రి జీవిత కథ ఆధారంగా ‘మహానటి’ తెరకెక్కించారు.  మొదట్లో ఈ చిత్రం విషయంలో ఎన్నో అనుమానాలు..అపార్థాలు నెలకొన్నాయి. సావిత్రి ఎంత గొప్పగా జీవించిందో..చివరి దశలో అంత దుర్భరమైన స్థితిలో మరణించిందని రక రకాల రూమర్లు వచ్చాయి.  కానీ ‘మహానటి’ చిత్రంలో ఆమె జీవితం గురించి ఎంతో చక్కగా వివరించారు..చివరి దశలో ఎలాంటి పరిస్థితి అనేది కళ్లకు కట్టినట్లుగా చూపించారు.  ఇక ‘మహానటి’ చిత్రంపై తెలుగు ఇండస్ట్రీనే కాదు తమిళ, కన్నడ, మళియాళ ఇండస్ట్రీ వారు సైతం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 
Image result for mahanati
ఇదిలా ఉంటే..‘మహానటి’ చిత్రాన్ని తాను చూడలేదని..ఆమెకు సన్నిహితంగా ఉన్న సినీనటి జమున అన్నారు.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సావిత్రి వంటి 'మహానటి' జీవితాన్ని తెరకెక్కించడం సాహసమేనని చెప్పాలి. జనానికి సినిమా బాగా నచ్చే వుంటుంది .. లేకపోతే ఎందుకు చూస్తారు. సావిత్రితో వున్న అనుబంధం కారణంగా ఆమె జీవితంపై సినిమా రావడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. అలాంటి ప్రయత్నాన్ని చేసిన ఈ సినిమా టీమ్ కి .. సావిత్రిగా చేసిన కీర్తి సురేశ్ కి అభినందనలు తెలియజేస్తున్నాను.
Image result for mahanati
ఈ సందర్భంగా మీరు ‘మహానటి’ చిత్రాన్ని చూశారా అన్న ప్రశ్నకు..గతంలో కొత్త సినిమా రిలీజ్ అవుతుందంటే .. మా అందరినీ పిలిచి ప్రివ్యూ వేసి చూపించేవారు. ఇప్పుడు ఆ సిస్టమే పోయింది. మీరొచ్చి సినిమా చూశారా? అని అడిగితే నేను ఏం చెబుతాను? నేను సినిమా హాలుకి వెళ్లి టికెట్టు కొనుక్కుని సినిమా చూసే పరిస్థితి లేదుగా" అంటూ నిట్టూర్చారు.    


మరింత సమాచారం తెలుసుకోండి: