‘మహానటి’ విడుదలై నేటితో వారంరోజులు పూర్తి అవుతూ ఉన్నా ఆమూవీ మ్యానియా నుండి ఇంకా చాలామంది తేరుకోలేక పోతున్నారు. ఈ సినిమాను చూసిన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు చేస్తున్న కామెంట్స్ పరిసిలీస్తూ ఉంటే ఈమూవీతో ప్రముఖుల దగ్గర నుంచి సామాన్యుల వరకు ఎలా కనెక్ట్ అయిపోయారో అర్ధం అవుతుంది. 
సినిమా చూసిన తర్వాత నిద్ర పట్టలేదు
ఈ నేపధ్యంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ మూవీ పై చేసిన కామెంట్స్ మరింత చర్చనీయాంశం గా మారాయి. 'మహానటి' చూసిన తర్వాత బన్నీ రెస్ట్‌లెస్‌ గా మారడమే కాకుండా చివరకు నిద్రమాత్రలు వేసుకుంటే కాని నిద్రపట్టని పరిస్థితి తనకు ఏర్పడిన విషయాన్ని స్వయంగా తెలియ చేసాడు.   
MAHANATI MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈసినిమా చూసిన తర్వాత ఆరోజు రాత్రి తనకు అసలు నిద్రపట్టలేదు అన్న విషయాన్ని బన్నీ వివరిస్తూ తన జీవితంలో ఫస్ట్ టైమ్ జెట్‌ల్యాగ్‌ ట్యాబ్లెట్‌ (నిద్రమాత్ర) వేసుకుని నిద్రపోయిన పరిస్థుతులు ఏర్పడిన విషయాన్ని బయటపెట్టాడు. అంతేకాదు ట్యాబ్లెట్ వేసుకుని తాను నిద్రపోవడానికి ప్రయత్నించినా నిద్రపట్టకపోవడంతో ఉదయం 5.30కు మెలకువ వచ్చిన విషయాన్ని నవ్వుతూ గుర్తుకు చేసుకున్నాడు అల్లు అర్జున్. 
MAHANATI MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
టాప్ హీరోలు నటించిన సినిమాలు సంవత్సరానికి పది వస్తే పది సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే స్థాయిగల సినిమా ‘మహానటి’ అంటూ ఆసినిమాను ఆకాశంలోకి ఎత్తేస్తున్నాడు. ఒక మంచి స్క్రిప్ట్ ఉంటే దానికి అయస్కాంతంలా అన్ని మంచి విషయాలు వచ్చి అంటుకుంటాయని అటువంటి సందర్భమే ‘మహానటి’ విషయంలో జరిగింది అని అంటున్నాడు. ఇదే సందర్భంలో బన్నీ మాట్లాడుతూ ఈసినిమాకు కొలమానంగా కలక్షన్స్ ను పరిగణిస్తూ ఎవరూ వార్తలు ప్రచారం చేయవద్దని ‘మహానటి’ సినిమా విజయాన్ని కేవలం కలక్షన్స్ తో ప్రామాణికంగా తీసుకుని కామెంట్ చేయడం మంచిదికాదు అని అంటున్నాడు. అందుకేకాబోలు ఈమూవీ కలక్షన్స్ సునామీ సృష్టిస్తున్నా ఈమూవీ కలక్షన్స్ పై ఎటువంటి అధికారక ప్రకటన ఈమూవీ నిర్మాతలు ఇవ్వడం లేదు..   




మరింత సమాచారం తెలుసుకోండి: