స్మాల్ స్క్రీన్ పై సంచలనాలు సృష్టిస్తున్న బిగ్ బాస్ షో హిందిలో ఎంత పెద్ద్ద హిట్ అయ్యిందో తెలుగులో కూడా అంతే పెద్ద సక్సెస్ అయ్యింది. రియాలిటీ షోలో తెలుగు ఆడియెన్స్ కు సరికొత్త అనుభూతిని పంచుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో మొదటి సీజన్ సూపర్ హిట్ అయ్యింది. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా ఈ షో అదరగొట్టేసింది.


మొదటి సీజన్ విన్నర్ గా శివబాలాజి నిలిచాడు. ఇక బిగ్ బాస్ సెకండ్ సీజన్ కు రంగం సిద్ధమవుతుంది. ఈ సీజన్ కు అందరు అనుకుంటున్నట్టుగా నాని వ్యాఖ్యాతగా చేస్తాడని అంటున్నారు. మొన్నామధ్య నాని కూడా ఆ విషయం తాను చెబితే బాగోదంటూ మాట దాటేశాడు. ఇక దాదాపు బిగ్ బాస్ తెలుగు సెకండ్ సీజన్ హోస్ట్ గా నానిని ఫిక్స్ అయ్యే లోపే అదిరిపోయే ట్విస్ట్ బయటకు వచ్చింది. 


ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ హోస్ట్ లిస్ట్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేరు వినపడటమే. నా పేరు సూర్య తర్వాత బన్ని ఏ సినిమా కమిట్ అవలేదు. మరోపక్క బిగ్ బాస్ జూన్ నుండే మొదలవుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. చూస్తుంటే బన్నినే బిగ్ బాస్ సెకండ్ సీజన్ హోస్ట్ గా కనిపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.


ఇది ఎంతవరకు నిజం తెలియాలంటే అన్నది బిగ్ బాస్ సెకండ్ సీజన్ హోస్ట్ ఫైనల్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే. నాచురల్ స్టార్ గా నాని వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్నాడు నానినే బిగ్ బాస్ హోస్ట్ అని ఫిక్స్ అయిన ఆడియెన్స్ కు సర్ ప్రైజ్ గా బన్ని పేరు వినిపించడం ఆశ్చర్యంగా ఉంది. దీనికోసమే బన్ని ఈమధ్య ముంబై కూడా వెళ్లాడని వార్తలు వస్తున్నాయి. మరి ఆ సంగతేంటో మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: