బాలీవుడ్ నటుడు మృతి ఏడాది తర్వాత తెరపైకి రావడం సంచలనంగా మారింది.  స‌ల్మాన్ ఖాన్ వాంటెడ్ చిత్రంతో బాగా ఫేమ‌స్ అయిన ఇంద‌ర్ కుమార్ ఆ త‌ర్వాత దాదాపు 20 చిత్రాల‌కి పైగా చేశాడు. భాఘీ, హ‌థ్యార్, మా తుజే స‌లామ్, అగ్నిప‌థ్‌, తుమ్ కో నా భూల్ పాయేంగే వంటి చిత్రాల‌లో న‌టించి మెప్పించాడు. బాలీవుడ్ నటుడు ఇందర్ కుమార్ సూసైడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జీవితంపై విరక్తి చెంది తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని చెబుతున్న వీడియో సంచలనం రేపడంతో కుటుంబ సభ్యులు స్పందించారు. 
indra kumar
తన భర్తది ఆత్మహత్య కాదంటూ భార్య మీడియాకు ముందుకు రావడం హాట్ టాపిక్ అయ్యింది. అసలు స్టోరీకొస్తే... గతేడాది చనిపోయారు. అయితే ఆయన గుండెపోటుతోనే కన్నుమూశారని డాక్టర్లు తేల్చారు. అయితే ఇందర్‌కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొత్త వాదన తెరపైకి వచ్చింది. ఈ వీడియోలో మద్యం తాగడం లేదు... వాస్తవం చెప్పాలని అనుకొంటున్నాను. చాలా తప్పులు చేశాను. ఇప్పుడు రోడ్డుపైన పడ్డాను.
రంగంలోకి ఇందర్ భార్య
అందుకే ఆత్మహత్య చేసుకొవాలనుకొంటున్నాను. నేను హీరో కావాలని వచ్చాను. సిక్స్ ప్యాక్ చేశాను. ఏ అవకాశం రాలేదు. దురదృష్టం వెంటాడింది. సూసైడే గత్యంతరంగా మారింది. అందుకే ఈ లోకం నుంచి వెళ్లిపోవాలనుకొంటున్నాను అని ఇందర్ కుమార్ వీడియోలో చెప్పాడు. కాగా, ఆయనది గుండెపోటు కాదు... ఆత్మహత్యంటూ ప్రచారం జరిగింది. దీనిపై విచారణ కూడా జరపాలనే వాదన కూడా వినిపించింది. 

సూసైడ్ వాస్తవం కాదు

తాజాగా ఈ వైరల్ వీడియోపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆయన సతీమణి.  ఆ వీడియో తన భర్త నటించిన ఫటీ పడి హై సినిమాలోనిదని చెప్పారు. ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదన్నారు. అలాగే ఫటీ పడి హై డైరెక్టర్ కూడా ఇదే విషయాన్ని చెప్పి... ఈ వివాదానికి ఇంతటితో పుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: