దర్శకుడు తేజ ఎన్టీఆర్ బయోపిక్ నుండి బయటకు వచ్చాక హీరో రానాతో సినిమా చేయబోతున్నాడు అని వార్తలు వచ్చాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా తేజ హీరో ఉదయ్ కిరణ్ బయోపిక్ వైపు అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ల‌వ‌ర్ బోయ్ ఇమేజ్ అందుకోవడమే కాకుండా వరుసగా హిట్ సినిమాల్లో నటించి అప్పట్లో ఒక హాట్ టాపిక్ గా మారిపోయాడు ఉదయ్ కిరణ్. 
UDAY KIRAN LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇతడిని హీరోగా పరిచయం చేసిన తేజ ఇప్పుడు అదే ఉదయ్ కిరణ్ పై బయోపిక్ తీయడానికి సంబంధించిన స్క్రిప్ట్ పనుల పై తేజ బిజీగా ఉన్నట్లు సమాచారం. అతి త్వరలోనే ఈమూవీకి సంబంధించిన ప్రకటన వస్తుంది అని అంటున్నారు. ‘చిత్రం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్ సినిమాల వల్ల అప్పట్లో యూత్ కు ఐకాన్ గా మారాడు. 
UDAY KIRAN LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అటువంటి హీరో ఆతరువాతకాలంలో సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో అవకాశాలు రాకపోవడం ఓకే టాప్ హీరో కుమార్తెతో పెళ్లి క్యాన్సిల్ కావడం ఈవిషయాలు అన్నీ ఒక బయోపిక్ మూవీ రక్తి కట్టించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఎవ్వరి అండదండలు లేకుండా ఎదిగిన ఉదయ్ కిరణ్ నటించిన తొలి మూడు సినిమాలతో సిల్వర్ జూబ్లీ అందుకున్న తరువాత అతడు ఒక టాప్ హీరో అయిపోతాడు అని అనుకున్నారు అంతా. అయితే అటువంటి ఉదయ్ కిరణ్ కెరియర్ డౌన్ ఫాల్ అవ్వడంతోపాటు అవకాశాలు లేక నిరాశతో ఆత్మహత్య చేసుకోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి.  
సంబంధిత చిత్రం
అయితే బయటపడని ఈ డార్క్ సీక్రెట్స్ ను బయటపెడుతూ ధైర్యంగా తేజ ఉదయ్ కిరణ్ బయోపిక్ తీయగలిగితే ఈసినిమా ‘మహానటి’ మించిన సంచలనం అవుతుంది. ఎన్టీఆర్ బయోపిక్ నుండి తప్పుకున్న తేజ ఈమూవీని ధైర్యంగా తీయగలిగితే తేజాకు విపరీతమైన పేరుతో పాటు డబ్బు కూడ వచ్చే ఆస్కారం ఉంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీని తేజ తన సొంత బ్యానర్ లో తీయబోతున్నట్లు టాక్..  



మరింత సమాచారం తెలుసుకోండి: