‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేయాలని పట్టుదలతో చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ మూవీ పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. అయితే అనూహ్యంగా ఈమూవీకి సంబంధించి ఇప్పుడు హడావిడి చేస్తున్న ఒక లేటెస్ట్ న్యూస్ షాకింగ్ గా మారింది. ఈసినిమా షూటింగ్ త్వరగా పూర్తి కావడానికి అవకాశం ఇవ్వకుండా చిరంజీవి అనుసరిస్తున్న వ్యూహాలు శాపంగా మారాయి అన్న గాసిప్పుల హడావిడి చేస్తున్నాయి. 
సంబంధిత చిత్రం
ఈసినిమాను వేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ కు విడుదల చేయాలి అని దర్శకుడు సురేంద్ర రెడ్డి భావిస్తూ ఉన్నా చిరంజీవి ఈ ఆలోచనలకు ఏమాత్రం సహకరించడం లేదు అని టాక్. భారీ చారిత్రక నేపథ్యం ఉన్న ‘సైరా’ మూవీ కోసం చిరంజీవి విపరీతమైన శ్రమ పడవలసి వస్తున్న నేపధ్యంలో షూటింగ్ లో చిరంజీవికి శారీరక మానసిక అలసట కారణంగా ఆయనకు ఎక్కువ సమయం విశ్రాంతి అవసరం అవుతోందని వార్తలు వస్తున్నాయి. 
SAIRA MOVIE WORKING STILLS కోసం చిత్ర ఫలితం
దీనితో ఈమూవీ షెడ్యూల్‌ కీ షెడ్యూల్‌ కీ మధ్య ఎక్కువ గ్యాప్ ఏర్పడటంతో అత్యంత భారీ తారాగణం నటిస్తున్న ఈమూవీకి మిగతా ఆర్టిస్టుల డేట్స్ తో సమస్యలు వస్తున్నట్లు సమాచారం. ఈపరిస్తుతులలో సమయం వృధా కాకుండా సురేంద్ర రెడ్డి మిగతా టాప్ ఆర్టిస్టుల పై తీయవలసిన సన్నివేశాలను తీస్తూ మధ్యలో చిరంజీవికి విశ్రాంతి ఇస్తున్నట్లు సమాచారం. 
SAIRA MOVIE WORKING STILLS కోసం చిత్ర ఫలితం
అయితే ఈమూవీకి విపరీతమైన గ్రాఫిక్స్ అవసరం ఉన్న నేపధ్యంలో ఈమూవీ షూటింగ్ పూర్తి కాకుండా గ్రాఫిక్ పనులు వేగం పుంజుకునే ఆస్కారం లేదు అని అంటున్నారు. ఇలాంటి పరిస్థుతులలో ఈమూవీ విడుదల వచ్చే ఏడాది సమ్మర్ కు మాత్రమే ఉంటుందని అప్పటి వరకు మెగా అభిమానులు ఓపిక పట్టవలసిందే అంటూ ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు హడావిడి చేస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: