మే 20న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బర్త్ డే.. తన ప్రతి బర్త్ డేకు ఫ్యాన్స్ కు తన సినిమాకు సంబందించిన లుక్ రివీల్ చేసి పండుగ వాతావరణం క్రియేట్ చేసే ఎన్.టి.ఆర్ రాబోతున్న తన బర్త్ డేకి ఎలాంటి ట్రీట్ ఇస్తాడా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. జై లవ కుశ తర్వాత త్రివిక్రం తో సినిమా చేస్తున్నాడు తారక్.


హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఈ సినిమా నిర్మితమవుతుంది. ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి డైరక్షన్ లో చరణ్ తో కలిసి మల్టీస్టారర్ కు సిద్ధం అవుతున్నాడు. ఈ బర్త్ డే నాడు ఈ రెండు సినిమాలకు సంబందించిన క్రేజీ ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. త్రివిక్రం సినిమా ఆల్రెడీ సెట్స్ మీద ఉంది కాబట్టి పర్వాలేదు.


కాని ఎన్.టి.ఆర్ బర్త్ డేకు రాజమౌళి ఏం ఎనౌన్స్ చేస్తాడు అని ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ట్రిపుల్ ఆర్ అంటూ సంచలనం సృష్టించిన జక్కన్న ఆ సినిమా నేపథ్యం ఏంటో చెబుతాడా లేక ఎన్.టి.ఆర్ ఫస్ట్ లుక్ ఏదైనా వదులుతాడా అన్నది తెలియాల్సి ఉంది. కచ్చితంగా త్రివిక్రం సినిమా ఫస్ట్ లుక్ తో పాటుగా రాజమౌళి సినిమా అప్డేట్ కూడా వస్తుందని అంటున్నారు. 


ఇక త్రివిక్రం తో ఎన్.టి.ఆర్ నటించే సినిమాకు అసామాన్యుడు టైటిల్ పరిశీలణలో ఉంది. పూజా హెగ్దె, శ్రద్ధ కపూర్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ట్రిపుల్ ఆర్ లానే ఈ ప్రాజెక్ట్ ను కూడ ట్రిపుల్ టి అని తమన్ ప్రమోట్ చేస్తుండటం విశేషం.



మరింత సమాచారం తెలుసుకోండి: