స‌మంత.. నాగ చైతన్య‌ని వివాహం చేసుకొని అక్కినేని కోడలిగా మారింది. ఇప్పుడు అభిమానులు ఆమెని తెలుగమ్మాయిగానే భావిస్తున్నారు . పెళ్ళి త‌ర్వాత స‌మంత సినిమాల‌కి పూర్తిగా దూరం అవుతుంద‌ని అంతా అనుకున్నారు.   వరుస విజయాలతో సమంత ఫుల్ ఖుషీగా వుంది. 'రంగస్థలం' .. 'మహానటి' .. ' ఇరుంబు తిరై' వంటి సినిమాలు విశేషమైన ప్రజాదరణ పొందాయి. ఊహించని విధంగా హ్యాట్రిక్ హిట్ .. అదీ చాలా తక్కువ గ్యాప్ లో పడటం ఆమెను సంతోషంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ఈ ఉత్సాహంతో ఆమె తన తదుపరి సినిమా అయిన 'యూ టర్న్' షూటింగులో పాల్గొంటోంది.సూప‌ర్ డీల‌క్స్ అనే సినిమాలోను స‌మంత ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. వీటితో పాటు శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో త‌న భ‌ర్త చైతూ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఇక క‌న్న‌డ రీమేక్‌లోను స‌మంత ముఖ్య పాత్ర పోషిస్తుంది.

ప‌వ‌న్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో స‌మంత జ‌ర్న‌లిస్ట్‌గా క‌నిపించ‌నుంది. లో బ‌డ్జెట్‌తో రీమేక్ చిత్రం రూపొందుతుండ‌డం వ‌ల‌న స‌మంత యూట‌ర్న్ రీమేక్‌కి రెమ్యున‌రేష‌న్ తీసుకోవ‌డం లేదట‌. సినిమా లాభాల్లో వాటా ఇచ్చేలా మాట్లాడుకుంద‌ని అంటున్నారు. కొంతకాలం క్రితం కన్నడలో భారీ విజయాన్ని అందుకున్న సినిమాకి ఇది రీమేక్. అదే పేరుతో అదే దర్శకుడు పవన్ కుమార్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.

సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన ఈ సినిమాలో సమంత ప్రధానమైన పాత్రను పోషిస్తోంది. షూటింగులో భాగంగా సమంత ఆటో ఎక్కిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. భూమిక కీలకమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలోను విడుదల చేయనున్నారు.   



మరింత సమాచారం తెలుసుకోండి: