Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Feb 19, 2019 | Last Updated 7:58 am IST

Menu &Sections

Search

‘సాక్ష్యం’ఆడియో ఫంక్షన్ కి ప్రత్యేక అతిథిగా పవన్ కళ్యాన్!

‘సాక్ష్యం’ఆడియో ఫంక్షన్ కి ప్రత్యేక అతిథిగా పవన్ కళ్యాన్!
‘సాక్ష్యం’ఆడియో ఫంక్షన్ కి ప్రత్యేక అతిథిగా పవన్ కళ్యాన్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య పవన్ కళ్యాన్ రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్న విషయం తెలిసిందే.   జనసేన పార్టీ స్థాపించిన తర్వాత ప్రజల తరుపు నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్న ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ సినిమా ఫ్లాప్ తర్వాత సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఇక ముందు తాను సినిమాలు చేయబోనని ఆ మద్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.  కానీ ఫ్యాన్స్, కుటుంబ సభ్యుల కోరిక మేరకు సినిమాల్లో నటించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. గతంలో పవన్ కళ్యాన్ తో మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు తో అభిప్రాయ భేదాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. 
sakshyam-bellamkonda-srinivas-bellam-konda-suresh-
కానీ సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ ముందు అన్న మెగాస్టార్ తో కలిసి పవన్ సందడి చేశారు.  అందే కాదు ఆ సినిమా ఆడియో ఫంక్షన్ కి కూడా చిరంజీవి వచ్చారు.  ఇదిలా ఉంటే ఈ మద్య నటి శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై పోరాడుతున్న సమయంలో పవన్ కళ్యాన్ పై బూతు మాటలు అనడంతో పెను వివాదాలకు దారి తీసింది.  ఆ సమయంలో నాగబాబు ప్రెస్ మీట్ పెట్టి తన తమ్ముడు పవన్ కళ్యాన్ గురించి ఎంతో గొప్పగా పొగిడారు.  దాంతో మెగాబ్రదర్ కూడా పవన్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నట్లు తెలిసిపోయింది. 
sakshyam-bellamkonda-srinivas-bellam-konda-suresh-

ఇదిలా ఉంటే..ఫిలిమ్ ఛాంబర్ లో అల్లు అర్జున్, నాగాబాబు లు పవన్ కళ్యాన్ కి అండగా నిలబడ్డారు.  మొత్తానికి ఇప్పుడు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ ఒక్కటే అని చాటి చెప్పారు.  అంతే కాదు పవన్ కళ్యాన్ ‘రంగస్థలం’, ‘నా పేరు సూర్య’ సక్సెస్ మీట్ కి వెళ్లి ఆయా హీరోల గురించి తెగ పొగిడారు. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో 'సాక్ష్యం' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను సాధ్యమైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే దిశగా సన్నాహాలు చేస్తున్నారు.
sakshyam-bellamkonda-srinivas-bellam-konda-suresh-
ఈ లోగా ఈ సినిమా ఆడియో వేడుకను జరపాలనే నిర్ణయానికి వచ్చారు.ఈ నెల 26 వ తేదీన హైదరాబాద్ లో ఈ వేడుకను జరపనున్నారు. ఈ వేడుకకి ప్రత్యేక అతిథిగా పవన్ కల్యాణ్ ను ఆహ్వానించారట. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా తనకి భారీ విజయాన్ని అందిస్తుందనే బలమైన నమ్మకంతో బెల్లంకొండ శ్రీనివాస్ ఉన్నట్టుగా సమాచారం.   sakshyam-bellamkonda-srinivas-bellam-konda-suresh-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అందుకే ఇండియన్ 2 లో నటించడం లేదు!
పుల్వామా దాడిపై కమల్ సంచలన వ్యాఖ్యలు!
ప్లీజ్ మేడమ్..మా హీరోని పెళ్లిచేసుకోరా!
పాక్ నటులపై జీవితకాల నిషేధం!
అమరావతి..జ్యోతి హత్య కేసులో వీడిన మిస్టరీ!
నిఖిల్‘అర్జున్‌ సురవరం’కి కొత్త చిక్కులు!
పుల్వామాలో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు..మేజర్‌ సహా నలుగురు జవాన్ల మృతి
మెగా డాటర్ కి మంచి హిట్ ఇస్తాడా!
అంచనాలు పెంచుతున్న ‘118’ట్రైలర్!
అమితాబచ్చన్ 50 ఏళ్ళ నట ప్రస్థానం!
అజిత్ ‘విశ్వాసం’తెలుగులో విడుదలకు రంగం సిద్దం!
జయరాం కేసు - ఆ అమ్మాయి గొంతు నాది కాదు : నటుడు సూర్యప్రసాద్
సినీ, టివి నటి ఆత్మహత్య
చైతూ, సమంత ‘మజిలీ’టీజర్ రిలీజ్!
మహేష్, అనీల్ రావుపూడి కాంబినేషన్..నిర్మాతగా దిల్ రాజు!
ఆకాశ్‌ అంబానీ పెళ్లి పత్రిక చూస్తే..షాకే అవ్వాల్సిందే!!
త్వరలో పెళ్లిచేసుకోబోతున్న ఆర్య, సాయేషా సైగల్!
నయనతారపై కొత్త పుకార్లు?!
‘వినయ విధేయ రామ’ అక్కడ దుమ్మురేపుతుంది!