అనుకున్న బయోపిక్ అట్టహాసంగా మొదలుపెట్టినా దాని నుండి బయటకు వచ్చేశాడు తేజ. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చినట్టు కనిపించాడు. అయితే ఆ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ బయోపిక్ కోసం బాలకృష్ణ తేజను సెలెక్ట్ చేశాడు. ఆ ప్రాజెక్ట్ కొద్దిరోజులు ట్రై చేసి ఆ తర్వాత నా వల్ల కాదని చేతులెత్తేశాడు.


అయితే ఇప్పుడు ఉదయ్ కిరణ్ బయోపిక్ తీసే ఆలోచనలో ఉన్నాడట తేజ. చిత్రం సినిమాతో తను దర్శకుడిగా ఉదయ్ కిరణ్ హీరోగా కెరియర్ మొదలు పెట్టారు. నువ్వు నేను, ఔనన్నా కాదన్నా సినిమాలు ఉదయ్ కిరణ్ హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు. లవర్ బోయ్ గా దాదాపు స్టార్ ఇమేజ్ దక్కించుకున్నాడు అనుకున్న ఉదయ్ కిరణ్ అనూహ్యంగా సూసైడ్ చేసుకుని చనిపోయాడు.


ఉదయ్ కిరణ్ మరణానికి గల కారణాలు ఏంటి అన్నది తెలియలేదు. అయితే తేజ సడెన్ గా ఉదయ్ కిరణ్ బయోపిక్ గా కాబోయిన అల్లుడు అంటూ టైటిల్ కూడా రిజిస్టర్ చేయించాడట. ఉదయ్ కిరణ్ కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురిని ఇచ్చి పెళ్లిచేద్దామని అనుకున్నారు. ఎంగేజ్మెంట్ దాకా వెళ్లిన పెళ్లి ఆగిపోయింది. 


ఆ తర్వాతే ఉదయ్ కిరణ్ కెరియర్ పతనమైంది. ఉదయ్ కిరణ్ కెరియర్ పతనానికి మెగా ఫ్యామిలీకి సంబంధం ఉందా అన్న కోణంలో ఈ సినిమా ఉంటుందట. మరి తేజ ఈ సినిమాతో మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నాడా లేక నిజాలను బహిర్గతం చేస్తాడా అన్నది చూడాలి. టైటిల్ ను బట్టి చూస్తుంటే ఇదేదో వివాదాస్పదంగా మారేలానే ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: