యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఆ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ పై వస్తున్న వార్తలన్నిటితో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.


అసలు టైటిల్ ఏదై ఉంటుందా అన్న కన్ ఫ్యూజన్ మొదలైంది. అందుకే ఈ సినిమా టైటిల్ ను ఎన్.టి.ఆర్ బర్త్ డే కానుకగా రివీల్ చేస్తున్నారట. మే 20న ఎన్.టి.ఆర్ బర్త్ డే కానుకగా త్రివిక్రం సినిమా ఫస్ట్ లుక్ తో పాటుగా టైటిల్ కూడా రివీల్ చేస్తారని తెలుస్తుంది. నిర్మాణ సంస్థ నుండే అఫిషియల్ ప్రకటన వచ్చింది.


అయితే బర్త్ డే 20న కాబట్టి ముందు రోజే ఈ ఫస్ట్ లుక్ ఇంకా టైటిల్ రిలీజ్ చేస్తారట. మే 19నే ఎన్.టి.ఆర్ కొత్త సినిమా టైటిల్ ఎనౌన్స్ చేస్తారన్న మాట. సినిమాలో స్లిం గా కనిపిస్తున్నట్టు ఉన్న తారక్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్నాడని అంటున్నారు. ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి సినిమా కూడా చేస్తున్నాడు.


ఆ సినిమాలో చరణ్ తో కలిసి నటిస్తున్నాడు ఎన్.టి.ఆర్ బాహుబలి తర్వాత రాజమౌళి చేయబోయే మల్టీస్టారర్ సినిమా అది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనున్నట్టు తెలుస్తుంది. సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు జక్కన్న.



మరింత సమాచారం తెలుసుకోండి: