మే నెలలో నందమూరి అభిమానులకు రెండు పండుగలు వస్తాయి. మే 28న నందమూరి తారకరామారావు పుట్టినరోజు అయితే ఆ తాత మనవడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20. ప్రతి సంవత్సరం అభిమానులు కోలాహలంగా చేసుకునే ఈ పండుగలలో జూనియర్ అభిమానులు ఒక లేటెస్ట్ ట్విస్ట్ ను ఇస్తున్నారు. మే 20 నుండి ఒక వారం రోజుల పాటు జూనియర్ పుట్టినరోజు సందర్భంగా వారోత్సవాలను నిర్వహిస్తూ ఏకంగా ఒక వారం రోజుల పాటు సందడి చేయడానికి భారీ ప్రణాళికలు రచించినట్లు వార్తలు వస్తున్నాయి. 
JUNIOR NTR LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అనేక సేవా కార్యక్రమాలతో పాటు సోషల్ మీడియాలో జూనియర్ గొప్పతనాన్ని వివరిస్తూ ఒక వారంరోజుల పాటు భారీ స్థాయిలో ప్రచారం చేయడానికి జూనియర్ పి ఆర్ టీమ్ సహాయంతో తారక్ అభిమానులు భారీ స్కెచ్ వేస్తున్నారు. టాలీవుడ్‌లోని అన్ని సెలబ్రిటీ కుటుంబాలతో మమేకం అవుతూ కలుపుగోలుగా ఉంటూ మల్టిస్టారర్ శకానికి తెర తీస్తూ మిగతా హీరోల సినిమాలను ప్రమోట్ చేస్తూ జూనియర్ ఒక కొత్త ట్రెండ్ కు తెర తీసాడు అంటూ జూనియర్ గొప్పతనాన్ని అందరికీ తెలిసి వచ్చే విధంగా ఒక వారం రోజుల పాటు జూనియర్ అభిమానులు హంగామా చేస్తారని తెలుస్తోంది. 
JUNIOR NTR LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
‘భరత్ అనే నేను’ మూవీ వేడుకలోనూ ‘మహానటి’ ఆడియో ఫంక్షన్లోనూ సెంటరాఫ్ ఎట్రాక్షన్‌ గా నిలబడటమే కాకుండా ఆసినిమాల ప్రమోషన్ కు పరోక్షంగా సహకరించిన తారక్ గొప్పతనాన్ని జూనియర్ అభిమానులు వివరిస్తారట. అంతేకాదు తమ హీరో జస్ట్ హీరో మాత్రమే కాదని ఒక బ్రాండ్ అనీ తారక్ ఫ్యాన్స్ ఒక వారం రోజులు జూనియర్ పుట్టినరోజు నుండి విపరీతమైన ప్రచారం చేస్తారట. 
JUNIOR NTR LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అంతేకాదు జూనియర్ పుట్టినరోజునాడు జూనియర్ త్రివిక్రమ్ ల లేటెస్ట్ మూవీ ఫస్ట్ లుక్ ను కూడ విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవైపు మే 27 నుంచి 29 వరకూ విజయవాడలో తెలుగుదేశం ‘మహానాడు’ అట్టహాసంగా నిర్వహిస్తూ నందమూరి తారకరామారావు పుట్టినరోజును జరుపుకొబోతూ ఉంటే దీనికి సమాధానంగా జూనియర్ అభిమానులు ఇలా తారక్ పుట్టినరోజు వారోత్సవాలను నిర్వహిస్తున్నారనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: