దర్శకుడు రాజమౌళి తాను తన జీవితంలో ఎప్పటికైనా ‘మహాభారతం’ సినిమాగా తీయడం తన జీవిత ధ్యేయం అని చెప్పడమే కాకుండా ఆమూవీ తీయాలి అంటే 1000 కోట్ల బడ్జెట్ అవసరం అవుతుంది అని చెప్పిన విషయం తెలిసిందే. అయితే రాజమౌళి ఆశలు ఎంతవరకు వాస్తవ రూపం దాలుస్తాయో ప్రస్తుతానికి తెలియకపోయినా జక్కన్న ఆశల పై ఊహించని విధంగా క్రిష్ ఇవ్వబోతున్న షాక్ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. 
సంబంధిత చిత్రం
‘మహాభారతం’ పై లెక్కలేనన్ని టీవీ సీరియళ్ళు ఈమధ్య చాల వచ్చినా ‘మహాభారతం’ ను సినిమాగా తీయాలని అనేక ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు అమీర్ ఖాన్ ఈ ప్రయత్నాలలో ఉంటే మోహన్ లాల్ ని భీముడిగా పెట్టి ఒక భారీ బడ్జెట్ మూవీ అదేవిధంగా విక్రమ్ ను కర్ణుడుగా చూపెట్టడానికి మరో భారీ మూవీ సెట్స్ పైకి వెళ్ళబోతున్నాయి. అయితే ఈసినిమాలు ఇంకా పూర్తి కాకుండానే దర్శకుడు క్రిష్ ఒక సీక్రెట్ ఆపరేషన్ మొదలుపెట్టాడు. 
PARVA NOVEL PHOTOS కోసం చిత్ర ఫలితం
మహాభారత గాధను ఆధారంగా చేసుకుని కన్నడలో భైరప్ప అని రచయిత రాసిన ‘పర్వ’ అనే నవల కన్నడ సాహిత్య రంగంలో సంచలనాలు సృష్టించింది. రెగ్యులర్ ఫార్మాట్ లో కాకుండా ‘పర్వ’ నవల కమర్షియల్ గా సోషల్ ఎలెమెంట్స్ తో ఉంటుంది. అంటే భారతంలోని పాత్రలు సమాజంలోకి  వస్తే ఎలా జరుగుతుంది అనే ఆలోచనతో రాసిన అద్భుతమైన నవల ఇది. దీనిని తెలుగులోకి కూడా అనువదించారు. ఇప్పుడు క్రిష్ ఈనవల రైట్స్ ను కొని మూవీగా తీయడానికి తన దగ్గర ఉన్న రైటర్స్ టీమ్ చేత వర్క్ చేయిస్తున్నట్లు సమాచారం. 
DIRECTOR KRISH LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈసోషల్ మహాభారతాన్ని క్రిష్ వచ్చే సంవత్సరం నుండి పట్టాలు ఎక్కించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈవార్తలే నిజం అయితే మరో 10 సంవత్సరాలు తరువాత అప్పటి లేటెస్ట్ టెక్నాలజీతో మహాభారతాన్ని తీయాలని కలలు కంటున్న రాజమౌళికి క్రిష్ ఊహించని షాక్ ఇచ్చాడనుకోవాలి. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ‘మణికర్ణిక’ మూవీ విజయం బట్టి క్రిష్ ఈ సోషల్ మహాభారత నిర్మాణం ఆధారపడి ఉంటుంది అని అంటున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: