ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాలు జరుగుతున్న విషయం తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ దారుణంగా ఉందని..హీరోయిన్లుగా రాణిద్దామని వచ్చిన ఎంతో మంది నటీమణులను కొంత మంది దళారులు దారుణంగా అనుభవిస్తున్నారని నటి శ్రీరెడ్డి.  కాస్టింగ్ కౌచ్ పై పోరాడుతున్న ఆమె కొంత మంది ప్రముఖల ఫోటోలు కూడా లీక్ చేసింది.  ఇక పోరాటం ఉధృతం అవుతున్న సమయంలో పవన్ కళ్యాన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారే ఆమెకు సపోర్ట్ చేసిన వారు యూటర్న్ తీసుకున్నారు. 
Image result for '18.05.2009 movie
దాంతో ఆమె ఇంటికే పరిమతం అయ్యింది. ఈ సమయంలో తనను కొంత మంది బెదిరిస్తున్నారని..అవమానించే విధంగా ట్రోలింగ్ చేస్తున్నారని ఆరోపిస్తుంది.  తాజాగా దక్షిణాది నటి తాన్యకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి హత్య చేస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఈ విషయంలో ఆమె చెన్నై, వెపేరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 'నో కాలర్ ఐడీ', 447404617369 నంబర్ల నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆమె తన ఫిర్యాదులో ఇటీవల ఆమె '18.05.2009' అనే చిత్రంలో నటించగా, అది విడుదలకు సిద్ధమైంది తెలిపింది.
Image result for '18.05.2009 movie actress tanya
"నువ్వు ఒంటరిగానే ఉంటున్నావు. నిన్ను చంపేస్తాను" అని బెదిరిస్తున్నారని ఆమె తెలిపింది. కాగా, వడపళని పరిధిలోని తిరునగర్ సెకండ్ స్ట్రీట్ లో తాన్య తన తల్లితో కలసి నివసిస్తుంది.  ఈ నెల 14 అర్ధరాత్రి 1.15 గంటల సమయంలో ఆమెకు ఫోన్ చేసిన వ్యక్తి అసభ్యంగా మాట్లాడాడు. "ఆ సినిమాలో నటించింది నువ్వేగా, బయటకు రా... నీ పని చెప్తా" అంటూ బెదిరించాడు..అప్పట్లో ఇలాంటి ఫోన్లు కామన్ అనుకున్నా అదే పనిగా బెదిరించడంతో తాన్య ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది.

ఆ తర్వాత వచ్చిన ఫోన్ కాల్స్ కి అతనికి సమాధానం ఇస్తూ..తాను కేవలం నటించానని, అంతకు మించి తనకు సంబంధం లేదని, ఏమైనా సమస్య ఉంటే దర్శక, నిర్మాతలతో తేల్చుకోవాలని ఆమె చెప్పినా వినలేదు. ఇక సదరు గుర్తుతెలియని వ్యక్తి కాల్ తో తాను చాలా బయపడుతున్నానని, అతనిపై చర్యలు తీసుకోవాలని తాన్య, తన ఫిర్యాదులో పోలీసులను కోరింది.


మరింత సమాచారం తెలుసుకోండి: