సావిత్రి జీవితం పై నాగ్ అశ్విన్ తీసిన ‘మహానటి’ సూపర్ హిట్ కావడంతో సావిత్రి జీవితంలో జరిగిన సంఘటనలు ఆమె జీవితంలోని చీకటి కోణాల పై ఇప్పుడు మళ్ళీ చర్చలకు తెర లేచాయి. అయితే సావిత్రి పతనానికి ఆమె భర్త జెమినీ గణేషన్ కారకుడు అంటూ మళ్ళీ తెరపైకి వస్తున్న వార్తల దుమారం పై జెమినీ గణేషన్ కుమార్తె కమలా సెల్వరాజ్ ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సావిత్రి వ్యక్తిగత జీవితం పై సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఆమె జీవితంలోని ఒక విలన్ కోణాన్ని బయటపెట్టింది. 
కమల సెల్వరాజ్ వ్యాఖ్యలు
‘మహానటి’ మూవీలో సావిత్రికి మద్యం అలవాటు చేసింది తన తండ్రి జెమినీ గణేషన్ అన్నట్లు చూపించారని అయితే అది పూర్తిగా అవాస్తవం అంటూ మరొక ఆసక్తికర విషయాన్ని కమల సెల్వరాజ్ బయటపెట్టారు. సావిత్రికి తన తండ్రికి మధ్య భేదాభిప్రాయాలు తారా స్థాయికి చేరుకున్న తరువాత ఒక సందర్భంలో తాము సావిత్రి ఇంటికి వెళ్ళినప్పుడు తమ పై పెంపుడు కుక్కలను వదిలిన వ్యక్తిత్వం సావిత్రిది అంటూ సావిత్రికన్నా తన తండ్రి మరింత గొప్ప నటుడు అంటూ కామెంట్స్ చేసింది కమల సెల్వరాజ్.
 జెమినీ ప్రతిష్టకు భంగం
అంతేకాదు తన తండ్రి ఆరోజులలో స్టార్ హీరో అయిన నేపధ్యంలో తన తండ్రి చుట్టూ ఎంతోమంది హీరోయిన్స్ తిరగేవారని అలా తిరిగే వారు అన్న విషయాన్ని కమల చెప్పుకొచ్చింది. వాళ్ళ లిస్టులో పుష్పవల్లి సావిత్రిలు ఉన్నారు అంటూ వాళ్ళతో  పుట్టిన పిల్లలకు ఐడెంటిటీ ఇవ్వడం కోసం తన పిల్లలుగా అంగీకరించిన మంచితనం తన తండ్రిది అంటూ జెమినీ గనేషణ్ ఉన్నత వ్యక్తిత్వం పై అనేక కామెంట్స్ చేసింది. 
జెమినీని విలన్‌గా
వాస్తవానికి తన తండ్రి జెమినీ గణేషన్ సావిత్రిని ప్రేమించినంతగా తన తల్లి అలివేలును ఎప్పుడు ప్రేమించలేదని అయితే ఈవిషయాల ప్రస్తావన లేకుండా తన తండ్రి వ్యక్తిత్వం గురించి తప్పుగా ప్రచారం చేస్తూ తీసిన ‘మహానటి’ తనకు నచ్చలేదు అన్న సంకేతాలు ఇచ్చింది కమల సెల్వరాజ్. సావిత్రి చనిపోయిన తరువాత తన తండ్రి జెమినీ గణేషన్ భర్త బతికి ఉండగానే ఒక స్త్రీ మరణించినప్పుడు అంతిమ యాత్ర ఎలా జరుగుతుందో అలా అన్నీ దగ్గర ఉండి తన తల్లి తండ్రులు తమ ఇంటిలో చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ విషయాలు అన్నీ తీయకుండా తమ కుటుంబానికి ‘మహానటి’ అన్యాయం చేసింది అంటోంది ప్రస్తుతం చెన్నైలో ప్రముఖ గైనకాలజిస్ట్‌గా పేరు తెచ్చుకున్న కమల సెల్వరాజన్..  
 


మరింత సమాచారం తెలుసుకోండి: