సినీ రచయిత రాజసింహ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే.రుద్ర‌మ‌దేవి’, ‘అన‌గ‌న‌గా ఓ ధీరుడు’ వంటి సినిమాల‌కు ర‌చ‌యిత‌గా, ‘ఒక్క అమ్మాయి తప్ప’ అనే చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు రాజ‌సింహా ఆత్మహత్యాయత్నం చేసినట్టు కథనాలు మీడియాలో గురువారం హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. ఒక్క అమ్మాయి తప్ప' అనే సినిమాకు రాజసింహ దర్శకత్వం కూడా వహించాడు.
Image result for rajasimha-clarifies-suicide-a
ఆ సినిమా పరాజయంపాలవడంతో, ఆ తర్వాత ఆయనకు అవకాశాలు రాలేదు. దీంతో, డిప్రెషన్ కు లోనై, ఆత్మహత్యాయత్నం చేశాడనే వార్తలు వచ్చాయి.  
ఈ వార్తలపై రాజసింహ స్పందిచాడు. తాను ఆత్మహత్యకు యత్నించిన విషయంలో నిజం లేదని, జరిగింది ఒకటైతే.. మీడయాలో వచ్చింది మరొకటని వివరణ ఇచ్చారు.  తనకు మధుమేహం ఉందని... ముంబైలో ఉండగా ఒక్కసారిగా తనకు షుగర్ లెవెల్స్ పెరిగిపోయాయని, దీంతో స్పృహ తప్పి పడిపోయానని చెప్పాడు. తర్వాత అంతా హడావిడి జరిగింది. ఎవరో నన్ను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.

ప్రస్తుతం నా ఆరోగ్యం మెరుగుపడింది. నా గురించి కంగారు పడిన అందరికీ ధన్యవాదాలు. రెండు, మూడు రోజుల్లో హైదరాబాద్ వస్తాను’ అని రాజసింహ జరిగిన విషయాన్ని వివరించారు. వెంకటేశ్ కథానాయకుడిగా జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమించుకుందాం రా’ చిత్రంతో మాటల రచయితగా రాజసింహ సినీ కెరీర్ ప్రారంభమైంది.

ఆ తరువాత జయంత్ సి పరాన్జీ దగ్గరే కథ, దర్శకత్వ విభాగంలో టక్కరిదొంగ వరకూ పనిచేశారు. అనంతరం ‘మనసంతా నువ్వే’ నుంచి శంకర్ దాదా ఎమ్‌బీబీఎస్ వరకూ పరుచూరి సోదరుల వద్ద అసోసియేట్ రైటర్‌గా కొనసాగారు. సందీప్ కిష‌న్ హీరోగా ‘ఒక్క అమ్మాయి త‌ప్ప’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. కానీ  ఈ సినిమా అనుకున్న విజయాన్ని అందుకోలేక పోయింది. 




మరింత సమాచారం తెలుసుకోండి: