అలనాటి అందాల తార, దివంగత నటి శ్రీదేవి మరణం వెనక ఉన్న అపోహలు ఇప్పట్లో తొలగిపోయేలా లేవు. శ్రీదేవి ఫిబ్రవరి 24న దుబాయ్‌లోని ఒక హోటల్‌ లో ప్రమాదవశాత్తు బాత్‌ -టబ్‌ లో పడి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె చనిపోయినప్పుడు శ్రీదేవి గుండె పోటుతో చనిపోయారని తొలుత దుబాయ్‌ మీడియా వర్గాలు వెల్లడించాయి.
most beautiful picture of Sridevi కోసం చిత్ర ఫలితం
ఆ తర్వాత పోస్ట్‌ మార్టం నిర్వహించగా బాత్‌-టబ్‌లో మునిగి చనిపోయినట్లు తేలింది. అయితే ఈ విషయాన్ని ఆమె అభిమానులు పిటీషనర్లు అంగీకరించట్లేదు. పిటీషనర్ సునీల్ సింగ్ ఈ విషయమై సుప్రీం కోర్ట్ తలుపు తట్టటం జరిగింది. అయితే, మొత్తం కేసునే మే 11న సుప్రీం కోర్ట్  విచారణకు  తిరస్కరించుతూ గొప్ప నటీమణి మరణాన్ని వివాదాస్పధం చేయలేమని సుప్రీం కోర్ట్ సమాధానమిచ్చింది.  

కేసు పూర్వాపరాలు ఈ విధంగా ఉన్నాయి

అయితే శ్రీదేవి మృతిపై దర్యాప్తు చేపట్టాల్సిందిగా గతంలో కొందరు వ్యక్తులు సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. కానీ ఈ పిటిషన్‌ను భారత  సర్వోన్నత న్యాయస్థానం తిరస్క రించింది. ఆమె మృతి విషయంలో తాము కలగజేసుకోలేమని పేర్కొంది. ఈ నేపథ్యంలో డిల్లీకి చెందిన వేద్‌ భూషణ్‌ అనే మాజీ ఏసీపీ శ్రీదేవిని పథకమే ప్రకారం హత్య చేశారని వ్యాఖ్యనించడం వివాదాస్పదంగా మారింది. పదవీ విరమణ పొందాక  వేద్ భూషణ్‌ డిల్లీలో ఒక "ప్రైవేట్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ" ని నడుపుతున్నారు.
most beautiful picture of Sridevi కోసం చిత్ర ఫలితం
"5.1ఫీట్ పొడవైన బాత్ టబ్ లో 5.7ఫీట్ ఎత్తున్న శ్రీదెవి ఎలా నీట మునిగిమరణిస్తుంది" అన్న ప్రశ్నకు సుప్రీం నుండి సమాదానం లేదు.

"బాత్‌-టబ్‌ లో బలవంతంగా ముంచి చంపడం చాలాసులువు, మునిగి చనిపోయారని చెప్పి తప్పించుకునే అవకాశం ఉంటుంది. శ్రీదేవి ప్రమాదవశాత్తు చనిపోలేదు. ఆమెను పథకం ప్రకారం చంపేశారని నాకు అనిపిస్తోంది. దుబాయ్‌ వైద్యులు ఇచ్చిన ఫోరెన్సిక్‌ నివేదికపై నాకు సందేహాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాం" అని పేర్కొన్నారు మాజీ ఏసిపి వేద్ భూషణ్‌.  అయినా తాను ఈ విషయంలో విచారణ చేస్తానని అన్నారు. 

Sridevi, retired ACP of Delhi police

దుబాయి చట్టాలపై మాకు గౌరవముందని, కాని ఈ శ్రీదేవి మరణం విషయంపై మేము దుబాయి పోలీస్ పరిశోధన తో సంతృప్తి చెందలేదని ఆయన నిర్ద్వందంగా చేప్పారు. ఈ విషయంలో సమాధానం చెప్పని అనేక ప్రశ్నలు మిగిలిపోయాయని ప్రశ్నించారు. మేము దుబాయి ప్రభుత్వాన్ని ఈ విషయంలో యాధార్దాలన్నింటినీ సమీకరించాలని కోరుతున్నాం.  


దీనిపై శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ ఏమంటారో? 

శ్రీదేవిని ప్లాన్ ప్రకారం.. చంపేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: