తమిళ హీరో విజయ్ ఆంటోనీ ‘బిచ్చగాడు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయం సాధించారు.  ఒక తమిళ డబ్బింగ్ చిత్రం తెలుగు భారీ కలెక్షన్లు రాబట్టిందంటే..‘బిచ్చగాడు’ అనే చెప్పొచ్చు. అంతకు ముందు వచ్చిన డాక్టర్ సలీమ్, నకిలీ తో పెద్దగా గుర్తింపు తేచ్చుకోని విజయ్ ఆంటోనీ ‘బిచ్చగాడి’ తో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.   ఆ తర్వాత వచ్చిన బేతాళుడు, యమన్, ఇంద్రసేన చిత్రాలు వచ్చిన పెద్దగా విజయం సాధించలేదు.   ‘కాశి’ చిత్రం విషయానికి వస్తే..అమెరికాలో గొప్ప డాక్టర్ గా ఉండే భరత్ (విజయ్ ఆంటోనీ) తల్లిదండ్రులతో హాయిగా జీవిస్తుంటాడు.
Image result for vijay antony kaasi movie
కానీ అతని కలలో ఒక పాము, తనను ఎవరో పొడవటానికి ప్రయత్నిస్తున్నట్లు పదే పదే డిస్టబ్ చేస్తుంటాయి..ఆ కల ఎందుకు వస్తుంది..అసలు తన తల్లిదండ్రులు ఎవరు అన్న విషయాన్ని కనుక్కోవడానికి ఇండియా వస్తాడు. ఇండియా వచ్చిన భరత్ అసలు పేరు కాశీ అని తెలుసుకుంటాడు..తన చిన్నప్పుడే తల్లి చనిపోయిందని తెలుసుకుంటాడు. ఇక తన తండ్రి ఎవరు..ఎందుకు అతడి నుంచి దూరమయ్యాడు.. తన తండ్రిని కలుసుకున్నాడా..? అసలు భరత్ తన తండ్రికి ఎలా దూరమయ్యాడు..? అనే విషయంపైనే సినిమా కథ నడుస్తుంది.

చిన్నప్పుడే తన తల్లితండ్రులకు దూరమైన పిల్లాడు పెద్దయిన తరువాత వారిని వెతుక్కుంటూ వెళ్ళడం అనే కాన్సెప్ట్ బాగానే ఉంది. కానీ తర్వాత వచ్చే పాత్రలే చాలా చిత్ర విచిత్రంగా ప్రజెంట్ చేశారు.  ప్రజలకు ఉచిత వైద్య సహాయం చేయడం, అందరి డిఎన్ఏ లను చెక్ చేస్తూ తనతో మ్యాచ్ అయిందో లేదో చూసుకుంటూ చిత్రం మొత్తం ఇదే సాగుతుంది.  అంతలోనే ''కాట్రాజు'' లవ్ ట్రాక్ చెప్పడం పైగా అందులో విజయ్ ఆంటోనీను ఊహించుకోవడం కాస్త ఇబ్బందిగా ఉంది. 

మరోపాత్ర గజదొంగ రత్తయ్య మరో లవ్ ట్రాక్.. ఇవన్నీ కథను పక్కదారి పట్టిస్తూ సినిమాపై ఆసక్తిని పోగొడతాయి. పైగా ఆయా ట్రాకుల్లో విజయ్ ఆంటోనీ డిఫరెంట్ గెటప్స్ లో కనిపించాడు.  చర్చ్ ఫాదర్ క్యారెక్టర్‌లో మాత్రం విజయ్‌ కి అస్సలు చూడలేం. డిఫరెంట్ పాత్రల్లో  నటించేందుకు మనోడు చాలా కష్టపడ్డాడు. లవ్, సెంటిమెంట్, రొమాన్స్ ఇలా ఏ ఒక్క ఎమోషన్‌ను  సరిగా ప్రజెంట్ చేయలేక పోయాడు. విజయ్ అందించిన సంగీతం, నేపధ్య సంగీతం బాగున్నాయి.
Image result for vijay antony kaasi movie
సినిమాటోగ్రఫీ కథకు తగ్గట్లుగా ఉంది. యాక్షన్ సీక్వెన్స్ లో కొన్ని షాట్స్ బాగానే ఉన్నాయి.  ఎడిటింగ్ వర్క్ పై ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సివుంది. దర్శకురాలు కిరుతిగ ఉదయనిధి ఇంకాస్త ప్రయత్నించాల్సి ఉందని టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనా ‘కాశి’ చిత్రం రిజల్ట్ రేపటి వరకు ఎలా ఉంటుందో..హిట్టా..ఫట్టా అన్న విషయం తెలియనుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: