1965 భారత్ పాక్ మధ్య రెండవసారి యుద్దం యుద్ధంలో భారత్ దగ్గర మందుగుండు సామగ్రి అయిపోయింది.  నాటి ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి ప్రజలను విరివిగా విరాళాలు ఇవ్వమని దేశప్రజలను అభ్యర్థించాడు. 1965 సెప్టంబర్ ప్రధాని చాంబర్ లోనికి గుమస్తా వచ్చి మీ కోసం ఒక దక్షిణాది నటిగారు వేచిఉన్నారని చెప్పాడు.

Related image

శాస్త్రిగారు ఆలోచిస్తూ సరే లోపలికి పంపండి అన్నారు. ఐదు నిమిషాల తర్వాత 28 సంవత్సరాల వయస్సు వున్న యువతి వంటినిండా నగలతో దగదగలాడుతుండగా ప్రధాని గారికి నమస్కారం చేస్తూ లోనికి ప్రవేశించింది. శాస్త్రిగారితో తను ఎవరో పరిచయం చేసుకుంది..శాస్త్రిగారూ అభినందన పూర్వంగా నవ్వారు.,తర్వాత తను వచ్చిన పని చెబుతూ..తను ధరించిన ఆభరణములన్నింటిని తీసి శాస్త్రిగారి టేబుల్ మీద పెడుతూ ఇవన్నీ ప్రధాని నిధికి నా వంతు చిన్న సహాయం అని అన్న. 

Rare5 Rare Pictures of The Tollywood Legends

తాళిబొట్టు తప్ప అన్నీ నిలువుదోపిడీ ఇచ్చిన ఆమె వంక ఆశ్చర్యపోయి చూస్తుండి పోయారు ప్రధానిగారు. తర్వాత తేరుకొని ఆనందం నిండిన కళ్ళతో......
"బేటీ నువ్వు మహనీయురాలమ్మా.  దేశభక్తికి అభినందనలు" అంటూ ఆమెతో కరచాలనం చేసి ,గౌరవంగా గుమ్మం వరకు వచ్చి సాగనంపారట..ఆమెను!!
ఇంతకూ ఆమె ఎవరని ఆలోచిస్తున్నారా????? ఆమె "మన తెలుగునటి సావిత్రి"గారు. ఆమె చేసిన దానాలలో ఇదొకటి..ఆమె దేశభక్తికి ఉదాహరణ ఈ సంఘటన!!!


మరింత సమాచారం తెలుసుకోండి: