తెలుగు ఇండస్ట్రీలో ప్రతిసారి సంచలనాకు కేంద్రంగా నిలిచే రాంగోపాల్ వర్మ తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు. నాగార్జున కథానాయకుడిగా రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న ‘ఆఫీసర్’ సినిమా కథ తనదేనని జయకుమార్ అనే రచయిత పోరాటానికి సిద్ధమయ్యాడు. గతంలోనూ వర్మపై ఆరోపణలు చేసి కేసు కూడా పెట్టిన జయకుమార్ మరోమారు పోరాటానికి సిద్ధమయ్యాడు. ఈ మేరకు మీడియాకు ఓ లేఖ విడుదల చేశాడు. రామ్ గోపాల్ వర్మ, కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఆఫీసర్’ మూవీ శుక్రవారం నాడు (రోజు) విడుదల కావాల్సి ఉంది.
టెక్నికల్ సమస్యలు తలెత్తడంతో వాయిదా వేస్తున్నట్టు వర్మ ట్విట్టర్ ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్ర కథ నాదే వర్మ కాపీ కొట్టేశాడు అంటూ జయకుమార్ అనే రచయిత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆఫీసర్‌ను మరో వివాదం చుట్టుముట్టింది. ఇక వర్మ సినిమా అంటేనే వివాదం. టైటిల్ అనౌన్స్ మొదలు.. షూటింగ్, టీజర్, ట్రైలర్ ఇలా ప్రతి విషయంలోనూ కంటెంట్ ఉన్నా లేకపోయినా కాంట్రవర్శిలు మాత్రం తప్పకుండా ఉంటాయి. అదే ఆయన బలంగా భావిస్తుంటారు..దాంతో అనుకోకుండా విపరీతమైన పబ్లిసిటీ కూడా ఏర్పడుతుంది.
హీరో, హీరోయిన్, పాటలు, మాటలు, పగిలి పోయే పంచ్‌లు, ఫస్ట్‌లుక్, ప్రోమో, టీజర్, ట్రైలర్ వీటితో సినిమాలకు పేరు రావడం చూస్తుంటాం. కాని వర్మ సినిమాలకు మాత్రం ఇవేం అవసరం లేదు. మొత్తం కాంట్రవర్సీలతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటారు. కాగా, తన పేరు జయకుమార్ అనీ, రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో అమితాబ్ నటించిన ‘సర్కార్ 3’ సినిమాతో రచయితగా పరిచయమయ్యానని పేర్కొన్న ఆయన 2015లో తొలిసారి వర్మను కలిశానని పేర్కొన్నాడు.
అదే ఏడాది జనవరిలో ఇద్దరు పోలీస్ అధికారులపై తాను రాసుకున్న కథ గురించి వర్మకు చెబితే ఆయన ఆసక్తి చూపడంతో ఈమెయిల్ ద్వారా స్క్రిప్ట్‌ను ఆయనకు పంపినట్టు వివరించాడు. అందులో కొన్ని మార్పులు చేర్పులు చేసి మరోసారి పంపించాల్సిందిగా కోరారని..ఆ తర్వాత ‘ఆఫీసర్’ సినిమా ప్రొడక్షన్ మొదలైనప్పుడు కంపెన్సేషన్, క్రెడిట్ ఇస్తానని హామీ ఇచ్చిన వర్మ తర్వాత తననెప్పుడూ సంప్రదించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
వర్మ కాపీకొట్టి తీసిన మరో ప్రాజెక్టు మీద ఇప్పటికే హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో కేసు వేసినట్టు జయకుమార్ వివరించాడు. నా అనుమతి లేకుండా, నా హక్కులను ఉల్లంఘించి, నా సినిమా భవిష్యత్తును వర్మ దెబ్బతీశాడు’’ అని జయకుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. చిత్ర పరిశ్రమలోని పెద్దలు ముందుకొచ్చి తనకు అండగా నిలవాలని, తనకు న్యాయం చేయాలని జయకుమార్ అభ్యర్థించాడు.

5/
5 -
(1 votes)
Add To Favourite