బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నిలీయోన్ అంటే శృంగార తారగానే అందరికీ తెలుసు.  హాలీవుడ్ లో ఫోర్న్ చిత్రాల నుంచి బాలీవుడ్ లో ‘జిస్మ్ 2’ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.  అప్పటి నుంచి బాలీవుడ్ లో హీరోయిన్ గా నటించి తర్వాత ఐటమ్ సాంగ్స్ కే పరిమితం అయ్యింది.  అంతే కాదు తెలుగు లో కరెంట్ తీగ, గరుడ వేగ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ లో నటించి కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టింది. 
Image result for veeramahadevi
సన్నీలియోన్  ఐటమ్ సాంగ్ వేస్తేనే కుర్రకారు ఊగిపోతారు.  ఇప్పటి వరకు సన్నీలియోన్ ని శృంగార దేవతగా చూశారు..కానీ ఇప్పుడు వీరనారిగా చూడుబోతున్నారు. చారిత్రాత్మక చిత్రం ‘వీరమహాదేవి’. ఇందులో సన్నీ ధైర్యసాహసాలు కలిగిన రాణి పాత్రలో కనిపించనున్నారు. వి.సి.వడివుడయాన్ దర్శకత్వంలో స్టివ్స్ కార్నర్ పతాకంపై ఫోన్స్ స్టీఫెన్ నిర్మిస్తున్నారు. రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒకేసారి ఐదు భాషల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలోని సన్నీ ఫస్ట్‌లుక్‌ను తాజాగా విడుదల చేశారు.
Image result for veeramahadevi
తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోని ప్రముఖ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. నాజర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. యుద్ధ సన్నివేశాల కోసం సుమారు 1000 గుర్రాలు, ఏనుగులను ఉపయోగిస్తున్నట్లు, నటీనటులకు గుర్రపుస్వారిలో శిక్షణ ఇస్తున్నట్లు నిర్మాత తెలిపారు. కేరళలోని అడవులలో ప్రభుత్వ ప్రత్యేక అనుమతితో భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నామని తెలిపారు.

గ్రాఫిక్స్ ఎక్కువగా ఉన్నందున కెనడాలోని ఓ సంస్థ, ఇండియాలోని ఒక కంపెనీతో కలసి పనిచేస్తున్నామని చెప్పారు. ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’, ‘గాడ్స్ ఆఫ్ ది ఈజిప్ట్’ చిత్రాలకు పనిచేసిన విజువల్ ఎఫెక్ట్స్ నిపుణులు ఈ చిత్రానికి పనిచేస్తున్నారని తెలిపారు. గ్రాఫిక్స్ కోసం సుమారుగా 40 కోట్లు ఖర్చుపెడుతున్నామని, ఈ చిత్రం కోసం సన్నీలియోన్ 150 రోజుల కాల్షీట్లు ఇచ్చారని చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: