యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న టైటిల్ పై రకరకాల వార్తలు వస్తున్నాయి. నిన్న మొన్నటిదాకా అసామాన్యుడు టైటిల్ పరిశీలణలో ఉన్నట్టు వార్తలు రాగా ఈ సినిమాకు ఫైనల్ టైటిల్ గా 'అరవింద సమేత రాఘవ' అన్న టైటిల్ లీక్ అయ్యింది.


ఎక్స్ క్లూజివ్ న్యూస్ ప్రకారం సినిమా టైటిల్ 'అరవింద సమేత రాఘవ'నే ఫిక్స్ చేశారని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్, త్రివిక్రం మొదటిసారి కలిసి చేస్తున్న ఈ సినిమా టైటిల్ తోనే కొత్త అనుభూతి కలిగేలా చేశారు. అంతేకాదు మళ్లీ త్రివిక్రం మార్క్ కనిపించేలా ఉంది ఈ టైటిల్. అజ్ఞాతవాసి తర్వాత కొద్దిగా వెనుకపడ్డట్టు అనిపించిన త్రివిక్రం మళ్లీ తన సత్తా చాటుతాడని అనిపిస్తుంది.


రచయితగా దర్శకుడిగా ఎప్పుడు వెనుకడుగు వేయని త్రివిక్రం ఎన్.టి.ఆర్ టైటిల్ గా 'అరవింద సమేత రాఘవ' అని పెట్టడంలో ఏదో పెద్ద అర్ధమే ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా టైటిల్ తో పాటు అఫిషియల్ ఫస్ట్ లుక్ ఈరోజు సాయంత్రం రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.


టైటిల్ రివీల్ అయ్యాక ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ మరో హీరోయిన్ గా నటిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: