మాస్ మహారాజ రవితేజాను కార్నర్ చేస్తూ కళ్యాణ్ రామ్ వేసిన స్కెచ్ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. గత కొన్ని నెలలుగా సినిమాల నిడివి పెద్దవిగా ఉన్నా పట్టించుకోకుండా జనం విపరీతంగా చూస్తున్నారు. ‘రంగస్థలం’ నుండి ‘మహానటి’ వరకు ఈమధ్య సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు అన్నీ ఇంచుమించు మూడు గంటల నిడివికి దగ్గరగా ఉన్నాయి.
NELA TICKET MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇప్పుడు ఇదే ట్రెండ్ ను కొనసాగిస్తూ వచ్చే వారం విడుదల కాబోతున్న రవితేజ ‘నేలటిక్కెట్టు’ మూవీ నిడివి కూడ 2 గంటల 47 నిమిషాలుండటంతో మాస్ మహారాజ టాప్ హీరోల సెంటిమెంట్ ను నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. అయితే అందరికీ షాక్ ఇస్తూ ‘నేలటిక్కెట్టు’ పోటీగా కళ్యాణ్ రామ్ నటిస్తున్న’నా నువ్వే’  సినిమా విడుదల ఒక హాట్ టాపిక్ అయితే ఈసినిమా లెంగ్త్ 1 గంట 58 నిమిషాలు మాత్రమే అన్న వార్తలు వస్తున్నాయి. 
KALYAN RAM NAA NUVVE MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
దీనికితోడు ఈ మధ్యనే విడుదలయిన ఈ సినిమా ట్రైలర్ ఒకేరోజులో 7 మిలియన్ల వ్యూస్ రాబట్టడంతో ఈసినిమాలో ఏముంది అన్న చర్చలు జరుగుతున్నాయి.  అంతేకాదు ఈమూవీలో కళ్యాణ్ రామ్ పక్కన హీరోయిన్ గా నటించినందుకు తమన్నాకు ఏకంగా కోటీ ఎనబై లక్షలు పారితోషికం ఇచ్చారు అన్న వార్తలు మరింత సంచలనంగా మారాయి. 
సంబంధిత చిత్రం
స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకున్న చాలామంది తెలుగు హీరోయిన్లు సినిమాకి కోటి రూపాయల దాకా డిమాండ్ చేస్తున్నారు. ఈమూవీలో కళ్యాణ్ రామ్ ప్రేమకోసం తపించే రేడియో జాకీ పాత్రలో తమాన్నా నటిస్తోంది. ఇప్పటికే పెద్దగా అంచనాలు లేని ‘నేలటిక్కెట్టు’ తో మరింత పెద్దగా అంచనాలు లేని ‘నా నువ్వే’ పోటీ పడుతున్న నేపధ్యంలో రవితేజా కళ్యాణ్ రామ్ ల వార్ లో విజేత ఎవ్వరు అన్న ఆసక్తి ఇండస్ట్రీ వర్గాలలో ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: