నేచురల్ స్టార్ నాని బుల్లితెర ఎంట్రీ ఇస్తూ త్వరలో ప్రారంభం కాబోతున్న ‘బిగ్ బాస్ 2’ షోకు హోస్ట్ గా ఎంపిక అయిన తరువాత లేటెస్ట్ గా ‘స్టార్ మా’ ఛానల్ విడుదల చేసిన ‘బిగ్ బాస్’ ప్రోమోలో నాని  'బాబాయ్  ఇంకొంచెం మసాలా' అంటూ చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటి అన్న విషయమై ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ‘బిగ్ బాస్ 2’ లో బూతు మసాలా కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అన్న సంకేతాలు బుల్లితెర ప్రేక్షకులకు ఇవ్వడానికే నాని చేత ఈషో ప్రోమోలో ఈ డైలాగ్ చెప్పించారు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

రియాల్టీ షోలలో కాంట్రవర్సీ ఎక్కువగా ఉంటేనే రేటింగ్స్ ఎక్కువ వస్తాయి. దీనికితోడు ఇన్ డైరెక్ట్ గా బూతు అర్ధాన్ని కలిగించే డైలాగ్స్ కూడ ఉంటే సామాన్య ప్రేక్షకులు ఇలాంటి షోలకు చాల సులువుగా కనెక్ట్ అయిపోతారు. అందువల్ల ఈసారి ఈషోలో మసాలాను బాగా పెంచే ఉద్దేశ్యంతో ఈ షో నిర్వాహకులు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. 
NANI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
తెలుస్తున్న సమాచారం మేరకు ఈసారి ‘బిగ్ బాస్ 2’  షోలో హాట్ బ్యూటీలను ఎక్కువగా పెట్టి గ్లామర్ టచ్ ఎక్కువగా ఇవ్వబోతున్నట్లుతెలుస్తోంది. ఈసారి ఈ షో షూటింగ్ 106 రోజులు జరగడమే కాకుండా ఈ రియాలిటీ షోను 60 కెమెరాలతో షూట్ చేస్తారని అని అంటున్నారు. 
NANI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే ఇలాంటి రియాల్టీ షోలను నిర్వహించే సెలెబ్రెటీకి హోస్ ను ఆర్డర్ లో పెట్టగల స్థితప్రజ్ఞత హోస్ మేట్ ల మధ్య ఏర్పడే భేదాభిప్రాయాలు కొట్లాటలు కుమ్ములాటలు లాంటి విషయాలను చక్కపెట్టగల సమర్ధత నానికి జూనియర్ స్థాయిలో ఉందా ? అన్న అనుమానాలు మరికొందరు వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా 10 ఏళ్ల క్రితం టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాని ఇప్పటికి 20 సినిమాలు నటించిన నేపధ్యంలో బుల్లితెర స్టార్ గా నాని కెరియర్ కు ఈ ‘బిగ్ బాస్ 2’ ఒక అగ్నిపరీక్ష అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: