జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈరోజు తమ యంగ్ టైగర్ 35వ పుట్టినరోజును మంచి జోష్ లో జరుపుకుంటున్నారు. ఈ ఉత్సాహానికి జోరును ఇచ్చే విధంగా నిన్న సాయంత్రం విడుదలైన జూనియర్ త్రివిక్రమ్ ల లేటెస్ట్ మూవీ ‘అరవింద సమేత’ ఫస్ట్ లుక్ కు మంచి స్పందన రావడంతో తారక్ అభిమానులలో ఆనందానికి హద్దులు లేవు.  
RAM CHARAN ALONG WITH JUNIOR LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే ఆశ్చర్యకరంగా జూనియర్ పుట్టినరోజును రామ్ చరణ్ అభిమానులు కూడ అత్యంత ఘనంగా ఈరోజు జరుపుకోవడం హాట్ న్యూస్ గా మారింది. విజయవాడలో ఈరోజు చరణ్ అభిమానులు జూనియర్ పుట్టినరోజు సందర్భంగా 35 కేజీల భారీ కేక్ ను కట్ చేయబోతున్నారు. అంతేకాదు మండే వేసవిలో అందర్నీ చల్ల బరచడానికి విజయవాడలోని అనేక సెంటర్లలో చరణ్ అభిమానులు ఈరోజు జూనియర్ పుట్టినరోజును సెలెబ్రేట్ చేసుకుంటూ మజ్జిగ పంచబోతున్నారు.
RAM CHARAN ALONG WITH JUNIOR LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అంతేకాదు ఈరోజు జరుగుతున్న జూనియర్ పుట్టినరోజును పురస్కరించుకుని చరణ్ వీరాభిమానులు కొందరు ఈరోజు భాగ్యనగరంలోని ఒక ప్రముఖ పబ్ లో మీడియా వర్గాలకు ఒక పెద్ద పార్టీని ఇవ్వబోతు ఉండటం మరింత షాకింగ్ న్యూస్ గా మారింది. ఒక టాప్ హీరో అభిమానులు మరో టాప్ హీరో పుట్టినరోజును ఇంత ఘనంగా నిర్వహించిన సందర్భాలు ఈమధ్య కాలంలో లేవు.
RAM CHARAN ALONG WITH JUNIOR LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
చరణ్ జూనియర్ ల మధ్య చాల మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం ఓపెన్ సీక్రెట్. ఈమధ్యనే చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి జూనియర్ పెళ్లిరోజు వేడుకలను జూనియర్ ఇంటికి వెళ్ళి సెలిబ్రేట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ టాప్ హీరోల స్నేహాన్ని మరింత పటిష్టం చేయడానికి చరణ్ అభిమానులు జూనియర్ పుట్టినరోజును ఇలా ఘనంగా సెలిబ్రేట్ చేస్తున్నారనుకోవాలి. చరణ్ జూనియర్ లతో మల్టీ స్టారర్ తీస్తున్న రాజమౌళికి ప్రస్తుతం చరణ్ అభిమానులు జూనియర్ పై చూపిస్తున్న ఈ అభిమానం ఆనందాన్ని కలిగించే విషయం..   


మరింత సమాచారం తెలుసుకోండి: