చిన్నప్పటి నుంచి హీరోను అవుతాను అని కలలు కంటూ ఇండస్ట్రీకి వచ్చి తొమ్మిది సంవత్సరాలపాటు సక్సస్ కోసం పోరాడి చివరకు అదృష్టం కలిసి వచ్చి ఇప్పుడు వరస విజయాల హీరోగా క్రేజ్ తెచ్చుకున్న శర్వానంద్ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్స్ పై ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ఇండస్ట్రీ అంటే చాలామందికి తప్పుడు అభిప్రాయం ఉందని అంటూ ఇండస్ట్రీలోని ఎంత గొప్ప వ్యక్తి అయినా మరో వ్యక్తిని తొక్కేయాలి అనుకుని ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కాదు అంటూ అభిప్రాయ పడుతున్నాడు శర్వా.
SHARWANAND LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇండస్ట్రీలో ఎవరు ఎవర్ని తోక్కెయలేరని మనం తీసుకున్న తప్పుడు నిర్ణయాలకు దురదృష్టం కూడ తోడైనప్పుడు ఎంత గొప్ప వ్యక్తి అయినా జీవితంలో ఓడిపోతాడు అంటూ మనం చేసిన తప్పులకు ఎదుటవారిని బాధ్యలను చేస్తూ మాట్లాడినంత మాత్రాన సమస్యలు తీరిపోవు అని ఇండస్ట్రీలో ఎవరుఎవరికీ గాడ్ ఫాదర్స్ కారు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసాడు ఈ యాంగ్ హీరో. ఇదే సందర్భంలో తన కెరియర్ గురించి మాట్లాడుతూ తాను అసలు హీరోను అవుతానా అని మధన పడిన స్థాయి నుండి నేటికి హీరోగా ఎదిగిన విషయాలను వివరిస్తూ తనను కొడుకుగా భావించి తన ఆస్థిలో సగం రాసి ఇస్తాను అని ఉత్తరాలు రాస్తున్న అభిమానులు తనకు ఉండటం తన అదృష్టం అని అంటున్నాడు శర్వానంద్.
సంబంధిత చిత్రం
ఇదే సందర్భంలో తన పై ఇప్పటి వరకు చెప్పుకోతగ్గ గాసిప్పులు రాకపోవడానికి గల కారణాలు వివరిస్తూ తనకు కూడ అన్ని సరదాలు ఉన్నాయి అని అంటూ అయితే ప్రతి సరదాని ఒక పద్ధతి ప్రకారం పరిమితిగా చేస్తూ ఉండటంతో తనపై గాసిప్పులు రావడం లేదు అంటూ తనపై తానే కామెంట్ చేసుకున్నాడు శర్వానంద్. ఇక తన వరస విజయాల గురించి మాట్లాడుతూ తనకు 10 కోట్ల పారితోషికం ఇస్తారన్న వార్తలలో రాని ఆనందం ఒక మంచి కథ విన్నప్పుడు వస్తుంది అంటూ తన సక్సస్ సీక్రెట్ ను బయటపెట్టాడు. 
SHARWANAND LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇండస్ట్రీలో తనకు నచ్చిన హీరో గురించి మాట్లాడుతూ తనకు శోభన్ బాబు అంటే చాల ఇష్టం అని ఒక క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని గడిపిన శోభన్ బాబులా ఉండటం ఎవరికీ సాధ్యం కాని పని అంటూ తాను శోభన్ బాబును అభిమానిస్తున్నా ఆయనలా ఉండలేను అంటూ తన బలహీనతను వ్యక్త పరిచాడు. ఇక తన పెళ్లి గురించి మాట్లాడుతూ తన పెళ్లి గురించి ప్రస్తుతం ఆలోచనలు చేయడం లేదని తాను అదృష్టాన్ని నమ్ముతాను కాబట్టి తనకు మాత్రమే కాకుండా తన కుటుంబ సభ్యులు అందరికీ నచ్చిన అమ్మాయి దొరికినప్పుడే తన పెళ్ళి అవుతుంది అంటూ క్లారిటీ ఇస్తున్నాడు శర్వానంద్..



మరింత సమాచారం తెలుసుకోండి: