మాటల మాంత్రికుడు త్రివిక్రం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా టైటిల్ గా అరవింద సమేత అని పెట్టారు. ఉపశీర్షికగా వీర రాఘవ అని కనిపిస్తుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పూజా హెగ్దె మెయిన్ లీడ్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రద్ధా కపూర్ కూడా సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. 


ఇక ఈ సినిమా టైటిల్ విషయంలో అరవింద సమేత చూస్తే త్రివిక్రం మళ్లీ తన 'అ' సెంటిమెంట్ రిపీట్ చేసినట్టు తెలుస్తుంది. మాటల రచయితగా ఉన్న త్రివిక్రం రైటర్ గా ఎన్నో సూపర్ హిట్లు కొట్టగా నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారాడు. ఇక అతడు సినిమాతో మహేష్ తో సూపర్ హిట్ అందుకున్నాడు.


అతడు తర్వాత త్రివిక్రం అత్తారింటికి దారేది సినిమా మళ్లీ త్రివిక్రం 'అ' సెంటిమెంట్ హిట్ ఇచ్చింది. అయితే ఆ తర్వాత పవర్ స్టార్ తో తీసిన అజ్ఞతావాసి మాత్రం డిజాస్టర్ గా మిలిగింది. ఎన్.టి.ఆర్ సినిమాకు 'అ' తో మొదలయ్యే టైటిల్ వద్దని అంటున్నా మళ్లీ తన పంతం నెగ్గించుకునేలా అరవింద సమేత అని టైటిల్ పెట్టాడు త్రివిక్రం. అసలైతే ఈ సినిమాకు వీర రాఘవ అని పెడదామని అనుకున్నారట. 


ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ 'అ' సెంటిమెంట్ భయం పట్టుకున్నా టైటిల్ పోస్టర్.. ఎన్.టి.ఆర్ లుక్ ఫ్యాన్స్ ను ఉత్సాహపరిచాయి. అసలే వరుస సక్సెస్ లతో ఉన్న తారక్ ఈ సినిమాతో మళ్లీ హిట్ కొట్టేస్తాడని అంటున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాపై ఫస్ట్ లుక్కే భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: