యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సంబరాలలో అభిమానులు తలమునకలై ఉంటే నేడు త్రివిక్రమ్ జూనియర్ తో తీస్తున్న ‘అరవింద సమేత వీర రాఘవ’ మూవీకి సంబంధించి ఈరోజు విడుదల చేసిన మోషన్ పోస్టర్ ఈరోజు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఈ మోషన్ పోస్టర్ విడుదలైన కొద్ది గంటలలోనే వేల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి. 
 రచ్చ చేస్తున్న ఫస్ట్ లుక్
దీనితో జూనియర్ త్రివిక్రమ్ ల మూవీ మొదటి పరీక్షలో అత్యధిక మార్కులు సంపాదించుకుని అంచనాలు పెంచుకుంది అని అనుకోవాలి. అయితే నిన్నటి ఫస్ట్ లుక్ లో జూనియర్ మాస్ అవతారాన్ని పరిచయం చేసిన త్రివిక్రమ్ నేడు జూనియర్ లోని రొమాంటిక్ లుక్ ను పరిచయం చేస్తూ ఈమూవీలో జూనియర్ చేసే పాత్రకు రెండు షేడ్స్ ఉంటాయి అన్న విషయాన్ని పరోక్షంగా త్రివిక్రమ్ తెలియచేస్తున్నాడు. 
పూజా హెగ్డేతో తొలిసారి
చిత్తూరు జిల్లా ఫ్యాక్షన్ డ్రాప్ తో నిర్మింపబడుతున్న ఈమూవీ కథలో జూనియర్ ఇప్పటి వరకు కనిపించని ఊర మాస్ లుక్ మాస్ ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ అవుతుంది అని అంటున్నారు. అదేవిధంగా మల్టీ ఫ్లక్స్ ఆడియన్స్ అదేవిధంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను ధియేటర్స్ కు రప్పించుకోవడానికి ఎన్టీఆర్ గోడమీద కూర్చుని రొమాంటిక్ గా పూజహెగ్డే వైపు చూస్తున్న మోషన్ పోస్టర్ చూసిన వారికి ఒకనాటి ‘బృందావనం’ లోని జూనియర్ లుక్ గుర్తుకు వస్తుంది. 
సంబంధిత చిత్రం
‘అజ్ఞాతవాసి’ షాక్ నుండి తేరుకుని త్రివిక్రమ్ చేస్తున్న ఈమూవీ విజయం అతడి కెరియర్ కు ఎంతో కీలకం కావడంతో తిరిగి జూనియర్ గోల్డెన్ టచ్ తో త్రివిక్రమ్ ట్రాక్ లోకి వస్తాడు అంటూ ఈరోజు విడుదలైన ఈ మోషన్ పోస్టర్ ను చూసి జూనియర్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. రాబోతున్న దసరా పండుగను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ఈమూవీకి ఈ మోషన్ పోస్టర్ చూసిన తరువాత భారీ బిజినెస్ ఆఫర్స్ రావడం ఖాయం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: