మెగాస్టార్ మాత్రమే కాదు ఆ తర్వాత పవర్ స్టార్, స్టైలిష్ స్టార్, మెగా పవర్ స్టార్ ఇలా ఇంతమంది స్టార్స్ కు మార్గదర్శకుడయ్యాడు చిరంజీవి. ఇక శిరీష్, సాయి ధరం తేజ్, వరుణ్ తేజ్ లు కూడా మెగా కాంపౌండ్ నుండ్ వచ్చి సక్సెస్ అయ్యారు. ఇక కొద్దిరోజుల్లో మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా వస్తున్నాడు.


అయితే వీరందరు ఒక ఎత్తైతే మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నిహారిక. మెగా బ్రదర్ నాగ బాబు తనయురాలిగా నిహారిక వెబ్ సీరీస్ లతో పరిచయమై.. బుల్లితెర మీద టెస్ట్ చేసుకుని ఫైనల్ గా సిల్వర్ స్క్రీన్ పై దర్శనమిచ్చింది. చేసిన ఒక సినిమా కాస్త విఫలమవడంతో వెనక్కితగ్గింది.


ప్రస్తుతం మరో రెండు సినిమాల్లో నటిస్తున్న నిహారిక తనకు ఎవరు లవ్ ప్రపోజ్ చేయలేదని చెబుతుంది. తన వెనుక ఉన్న మెగా హీరోలని చూసి భయపడి ఎవరు ప్రపోజ్ చేయలేదు కావొచ్చని అంటుంది నిహారిక. ఒకవేళ అలా కాకపోతే తాను బాగుండనేమో అన్న డౌట్ కూడా వచ్చిందని చెబుతుంది.


కాలేజ్ డేస్ లో కనీసం నా టేబుల్ మీద కూడా ఎవరు లవ్ లెటర్ పెట్టేవారు కాదని అంటుంది. మరి నిహారిక చెబుతున్నట్టు భయపడ్డారో లేక మరేమో కాని నిహారిక మాత్రం లవ్ ప్రపోజ్ లో ఉన్న కిక్ ఎంజాయ్ చేయలేదని అంటుంది. అంతేకాదు పెళ్లిచూపుల మీద కూడా తన ఒపినియన్ ఏంటో చెప్పింది అమ్మడు. ఈ కాలం పెళ్లిచూపుల మీద మంచి ఒపినియన్ ఉన్నట్టు ఆమె వెళ్లడించింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: