ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా తన నెక్స్ట్ మూవీ ఫస్ట్ లుక్ ఆ తరువాత మోషన్ పోస్టర్ వదిలినారు. అయితే ఫస్ట్ లుక్ కు వచ్చినంత బజ్ మోషన్ పోస్టర్ కు రాలేదని చెప్పాలి. మోషన్ పోస్టర్ మరీ చాలా తక్కువగా ఉంది. దీనితో అభిమానులకు అంత గా నచ్చలేదు. మోషన్ పోస్టర్ అయితే బాగుంది. థమన్ ఇచ్చిన ట్యూన్ బాగుంది. దానికి జోడించిన విజువల్ ఎఫెక్ట్స్ అట్రాక్టివ్ గా వున్నాయి. కానీ దాదాపు డే అంతా గడచినా గట్టిగా మూడు లక్షల హిట్స్ రాకపోవడం ఆశ్చర్యం.


త్రివిక్రమ్ లాంటి డైరక్టర్, ఎన్టీఆర్ లాంటి హీరో ల ఫస్ట్ మోషన్ పోస్టర్ జనాల్లోకి వెళ్లకపోవడానికి కారణం, దాన్ని ప్రాపర్ గా లాంచ్ చేయలేదని, ఫస్ట్ లుక్ కు చేసిన హడావుడి, మోషన్ పోస్టర్ విషయంలో కనిపించలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.పైగా లుక్, పోస్టర్ ఒకే ఈవెంట్ టైమ్ లో వదలడం అన్నది కూడా కాస్త తేడా చేసిందని వినిపిస్తోంది. అదీ కాక మోషన్ పోస్టర్ ఫైనల్ అయ్యేసరికి ఫైనల్ స్టిల్ కనిపించాలి. అంటే ముక్క ముక్క యాడ్ అయ్యి, ఫుల్ స్టిల్ ఫైనల్ గా రావాలి.

Image result for ntr trivikram new movie

కానీ ఈ పోస్టర్లో హీరో హీరోయిన్లను గట్టిగా అయిదారు సెకెండ్ లు చూపించి, శుభాకాంక్షలతో ఎండ్ చేసి, అక్కడే వదిలేసారు. దాంతో ఎన్టీఆర్ ను హీరోయిన్ ను చూడాలంటే మళ్లీ మళ్లీ వెనక్కు వెళ్లాల్సిందే. అందువల్లే ఈ మోషన్ పోస్టర్ కు రావాల్సిన క్రేజ్ రాలేదని మరో టాక్ వినిపిస్తోంది. ఏదైనా ఫస్ట్ లుక్ కు వచ్చిన క్రేజ్, మోషన్ పోస్టర్ కు రాలేదనే చెప్పాలి. ఎన్టీఆర్ డిజిటల్ టీమ్ కూడా ఈ విషయంలో కాస్త ఉదాసీనంగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. లేదూ అంటే పట..పటా..మిలియన్ల హిట్ లు రాలి వుండేవి.

మరింత సమాచారం తెలుసుకోండి: