మెగా ప్రిన్సెస్ గా మెగా అభిమానుల చేత పిలిపించుకునే నిహారిక ఇటీవల ఒకప్రముఖ ఛానల్ కార్యక్రమంలో పాల్గొంటూ అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేసింది. తనకు మెగా ప్రిన్సెస్ అని పిలిపించుకోవడం ఏమాత్రం ఇష్టం ఉండదు అనిచెపుతూ ఎవరైనా తనను అలా పిలిస్తే తనకు అక్కడ నుండి లేచి వెళ్లిపోవాలి అని అనిపిస్తుంది అంటూ మెగా ప్రిన్సెస్ పిలుపు పై తన అసహనాన్ని వ్యక్త పరిచింది.  
ఒక్కోసారి నేను బావుండనా? అనే డౌట్ వస్తుంది
ఇక తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ తనకు ఇప్పటి వరకు ఎలాంటిలవ్ ప్రపోజల్స్ రాలేదని అయితే చాలామంది తనకు అనేక లవ్ ప్రపోజల్స్ వచ్చాయి అని అనుకుంటూ ఉంటారని తనపై ఈమధ్య వచ్చిన గసిప్పులను దృష్టిలో పెట్టుకుని కామెంట్స్ చేసింది నిహారిక. అంతేకాదు తనను చూడగానే చాలామందికి తనవెనుక ముగ్గురు వ్యక్తులు కనిపిస్తారని అందువల్లనే బహుశా తనకు ఎవరూ ఎలాంటి లవ్ ప్రపోజల్స్ ఇచ్చి ఉండరు అన్న అభిప్రాయాన్ని ఈమె వ్యక్త పరిచింది. 
 నాకు పెళ్లి చూపులు ఐడియా అంటే చాలా ఇష్టం, కానీ అలా కాదు
తనను చూడగానే చాలామందికి తన నాన్న నాగబాబు డాడీ చిరంజీవి అన్న వరుణ్ తేజ్ కనిపిస్తారు కాబట్టి ఒకవిధంగా వీరు ముగ్గురు తన స్వేచ్చకు శత్రువులు అంటూ జోక్ చేసింది నిహారిక. దీనితో తనజీవితంలో ఇప్పటివరకు ఎవరి వద్ద నుంచి ఒక లవ్ లెటర్ కానీ ఒక లవ్ మెసేజ్ కానీ తనకు రాని విచిత్ర పరిస్థితి తనది అంటూ తనపై తానే సెటైర్ వేసుకుంది.   
ఎవడైనా ఇవ్వకపోతాడా? అని ఎదు చూశా
దీనితో ఒకొక్కసారి తనపై తనకే అసహనం ఏర్పడుతోంది అంటూ తన బాధలను వ్యక్తపరుచుకుంది. అయితే వాస్తవానికి తన తండ్రి నాగబాబు చాలా బ్రాడ్ మైండెడ్ అని ఆయన జనరేషన్ వారిలా కాకుండా చాలా అడ్వాన్డ్స్ గా ఆలోచిస్తారు అని తెలిసినా ఎవరు తనతో ఎందుకు సన్నిహితంగా ఉండరు అంటూ తనకు ఇప్పటికీ అర్ధం కాని ప్రశ్న అని అంటోంది. అయితే తాను తన తల్లి తండ్రులు ఎంపిక చేసిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను అని అంటూ గతంలో ఉండే మాదిరిగా తనకు పెళ్లి చూపులు కావాలని తాను తన తండ్రికి కండిషన్ పెడుతున్న విషయాన్ని బయటపెట్టింది. దీనికికారణం తన పెళ్లి చూపులలో ఎవరైనా ఒకసారి అలా నడవమ్మా అని అడిగితే ‘గంగ' చిత్రంలో నిత్యామీనన్ లాగ కుంటుకుంటూ నడవాలని ఉంది అంటూ తన వ్యక్తిగత జీవితంలో తీరని ఎన్నోకోరికలకు ఆముగ్గురు కారకులు అంటూ వారిపై తన కోపాన్ని మరొకసారి బయట పెట్టింది మెగా ప్రిన్స్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: