సోగ్గాడే చిన్ని నాయన’ ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాల విజయం తరువాత దర్శకుడుగా హ్యాట్రిక్ అందుకోవాలని కళ్యాణ్ కృష్ణ రవితేజాతో చేస్తున్న ‘నేలటిక్కెట్టు’ ప్రమోషన్ మొదలుపెట్టినా ఈసినిమా పై ఇంకా పూర్తి పాజిటివ్ వైబ్రేషన్స్ రాకపోవడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. ఈవారం విడుదలకాబోతున్న ఈమూవీని ప్రమోట్ చేస్తూ కళ్యాణ్ కృష్ణ ఒకఇంటర్వ్యూలో చెప్పినమాటలు ఈసినిమా సీక్రెట్ ను అనుకోకుండా బయటపెట్టాయి.
RAVITEJA IN NELA TICKET MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
వాస్తవానికి కల్యాణ్ కృష్ణ  ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సక్సస్ తరువాత ఈ ‘నేలటిక్కెట్టు’ కథను ఒకప్రముఖ హీరోను దృష్టిలో పెట్టుకుని వ్రాసాడట. అయితే అనుకోకుండా ఈకథ రవితేజాకు బాగా నచ్చడంతో ఈమూవీ ప్రాజెక్ట్ లో మాస్ మహారాజ వచ్చి చేరిన విషయాన్ని బయటపెట్టాడు కళ్యాణ్ కృష్ణ. దీనితో ఈకథ కళ్యాణ్ కృష్ణ గతంలో నాగార్జున కోసం వ్రాసిన కథ అన్నవిషయాన్ని పరోక్షంగా తనకు తెలియకుండానే బయటపెట్టాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 
RAVITEJA IN NELA TICKET MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
గతంలో నాగార్జునకు నచ్చని ఈకథను కొద్దిగా మార్పులుచేర్పులు చేసి కళ్యాణ్ కృష్ణ ఈకథలో రవితేజాను ఇరికించినట్లు గాసిప్పులు వినపడుతున్నాయి. ప్రస్తుతం మాస్‌ కోసమని తీసినసినిమాలు చాల బాక్సాఫీస్‌ దగ్గర బోల్తాపడుతున్నాయి. అన్నివర్గాల ప్రేక్షకులని అలరించే అంశాలతో పాటు కొత్తదనం ఉండే మూవీలను మాత్రమే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇలాంటి పరిస్థుతులలో ఈవారం విడుదలకాబోతున్న 'నేల టిక్కెట్టు' చిత్రానికి విడుదలకు ముందు ఎంతప్రయత్నించినా ఎలాంటి క్రేజ్‌ రాకపోవడంతో ఈసినిమాకు భారీ ఓపెనింగ్స్ ఎలా తెప్పించాలి అన్నవిషయమై ఈమూవీ నిర్మాతలు తెగ టెన్షన్ పడుతున్నట్లు టాక్. 
సంబంధిత చిత్రం
దీనికితోడు ఈసినిమాతో పోటీగా నాగశౌర్య ‘అమ్మమ్మగారిల్లు’ విడుదల అవుతున్న నేపధ్యంలో ఒక టాప్ హీరో సినిమాతో పోటీగా ఒక చిన్న హీరో సినిమా ఏమిటి అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. కేవలం మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని నిర్మించినట్లుగా కనిపిస్తున్న ఈ ‘నేలటిక్కెట్టు’ కు వచ్చే స్పందన బట్టి రవితేజ భవిష్యత్ సినిమాల మార్కెట్ ఆధారపడి ఉంటుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: