ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు ఆ సినిమా ను కొనడం కోసం బయ్యర్లు పోటీ పడుతుంటారు. అయితే తెలుగు సినిమా లకు ఓవర్సీస్ మార్కెట్ ఎంత ముఖ్యమో వేరే చెప్పాల్సిన పని లేదు. హిట్ టాక్ వస్తే చాలు అవలీలగా పది కోట్లు కలెక్ట్ చేస్తుంది. ఇక్కడ యాక్షన్ మూవీస్ కంటే సాఫ్ట్ మూవీస్ కే జై కొడుతారు. అయితే ఎన్టీఆర్ త్రివిక్రమ్ ఓవర్సీస్ రైట్స్ విషయం లో ఒక టాక్ నడుస్తోంది. 

Image result for jr ntr and trivikram

హారిక హాసిని సంస్థ గత సినిమా అజ్ఞాతవాసి భయంకరమైన ఫ్లాప్ గా మిగిలింది. ఆ సినిమా కొన్న ఓవర్ సీస్ బయ్యర్లు దారుణంగా నష్టపోయారు. సహజంగా అదే నిర్మాత మరో సినిమా చేస్తే, అంతలా నష్టపోయిన బయ్యర్ కు కాస్త తక్కువ ఇవ్వాల్సి వుంటుంది. అయితే హారిక హాసిని సంస్థ అలాంటివి ఏవీ ఆలోచించడం లేదని వినికిడి. ఇలాంటి టైమ్ లో బ్లూ స్కై సంస్థ 18కోట్లకో 20కోట్లకో హారిక హాసిని సంస్థతో నాలుగు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకుందని వార్తలు గుప్పుమన్నాయి. ఎన్టీఆర్-త్రివిక్రమ్, చైతూ-మారుతి, శర్వా-సుధీర్ వర్మ సినిమాలతో పాటు మరో సినిమా కలిపి ఈ డీల్ సెటిల్ అయిందన్నది వార్తల సారాంశం.

Image result for jr ntr and trivikram

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా అయితే ఎవరికీ ఫైనల్ చేయలేదని తెలుస్తోంది. హారిక హాసిని సంస్థ ఆశిస్తున్నంత రేటు ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రావకపోవడంతో, డీల్ ను ఫైనల్ చేయలేదని తెలుస్తోంది. డిస్కషన్లు నడుస్తున్నాయి కానీ, ఫైనల్ కాలేదని తెలుస్తోంది. మరి ఎంతకు ఫైనల్ అవుతుందో చూడాలి. ఎంతకు అమ్మినా ఓవర్ సీస్ లో కాస్త గట్టి పట్టు వున్న ఒకరిద్దరు బయ్యర్లతోనే డీల్ చేయాలని హారిక హాసిని సంస్థ చూస్తున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: