అల్లు అర్జున్ ఎన్నో అంచనాలు పెట్టుకుని నటించిన ‘నాపేరు సూర్య’ ఘోర పరాజయం చెందడంతో బన్నీ నటించబోయే సినిమాల ఎంపిక ప్లాన్స్ అన్నీ మారినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా బన్నీకి ఊహించని షాక్ ఇచ్చిన ‘సూర్య’ మూవీ వెనుక మహేష్ తిరస్కరణ ఉన్నట్లుగా ఇప్పుడు వార్తలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. 
VAKKANTHAM VAMSI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
వాస్తవానికి ‘సూర్య’ కథను దర్శకుడు వక్కంతం వంశీ మహేష్ ను దృష్టిలో పెట్టుకుని వ్రాసాడట. నిర్మాత అశ్వినీదత్ కోరిక పై వక్కంతం వంశీ మహేష్ కోసం ఈకథను గతంలో వ్రాసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మహేష్ ఈకథను విని షాక్ అవ్వడమే కాకుండా ఈకథలోని పాత్రకు తాను ఏమాత్రం సరిపోనని స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. 
PRODUCER ASWINI DUT LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
దీనితో అశ్వినీదత్ వక్కంతంను తప్పించి వంశీ పైడిపల్లిని మహేష్ కోసం రంగంలోకి దింపాడు అని అంటారు. అయితే ఇదే కథను పుచ్చుకుని వక్కంతం పట్టువదలని విక్రమార్కుడు లా చాలామంది హీరోల చుట్టూ తిరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రయత్నాల మధ్య వక్కంతం నిర్మాత నల్లమలుపు బుజ్జి దగ్గరకు వెళ్ళడం అతడు ఆకథను పుచ్చుకుని బన్నీ దగ్గరకు వెళ్లడం జరిగింది అని అంటారు. 
ALLUARJUN LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈకథ అల్లు అర్జున్ కు బాగా నచ్చడంతో ఓకె చేసి అనూహ్యంగా బుజ్జిని తప్పించి లగడపాటి శ్రీధర్ నిర్మాతగా ఈమూవీ ఫైనల్ అయింది అని తెలుస్తోంది. ఈ మూవీ ప్రాజెక్ట్ కు నాగబాబు బన్నీ వాసు కూడ సహ నిర్మాతలుగా మారడంతో భారీ అంచనాల మధ్య మొదలైన ఈసినిమా తన అంచనాలను నిలబెట్టుకోలేక అల్లు అర్జున్ కెరియర్ లో భారీ ఫ్లాప్ గా మారిపోయింది.  దీనితో ‘సూర్య’ దురదృష్టం  మహేష్ ను అదేవిధంగా అశ్వినీదత్ నల్ల మలుపు బుజ్జీలను దాటుకుని అల్లు అర్జున్ కు చుట్టుకుంది అంటూ ఇండస్ట్రీలో బన్నీ పై కొందరు సెటైర్లు వేస్తున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: