సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి సినిమా రికార్డుల పరంపరని కొనసాగిస్తుంది. రిలీజ్ అయిన నాటి నుండి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్న మహానటి మూవీకి మౌత్ టాక్ బాగా ప్లస్ అయ్యింది. ఇక ఈ సినిమా కలక్షన్స్ కూడా బీభత్సంగా ఉన్నాయి. యూఎస్ లో ఏకంగా 2 మిలియన్ డాలర్స్ వసూళు చేసి సంచలనం సృష్టించింది. 


సినిమాకు వచ్చిన ఈ భారీ హైప్ ను క్యాష్ చేసుకునేందుకు బుల్లితెర ఛానెల్స్ పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో జెమిని, స్టార్ మా, జీ తెలుగు మహానటి శాటిలైట్ రైట్స్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి. రిలీజ్ ముందు 5,6 కోట్ల ఆఫర్ వచ్చినా నిర్మాతలు సినిమా రిలీజ్ తర్వాతే శాటిలైట్ అనేశారట.


ఇక రిలీజ్ అయ్యి మంచి టాక్ వచ్చాక 11 కోట్లకు వచ్చినా ఈ సినిమా రేంజ్ అది కాదని తెలిసిందట అందుకే వెయిట్ చేశారు. ఇప్పుడు ఫైనల్ గా 22 కోట్ల దాకా మహానటి శాటిలైట్ రైట్స్ డిమాండ్ ఏర్పడిందని తెలుస్తుంది. 6 నుండి 22 కోట్లంటే మాటలు కాదు. ఈ లెక్కన చూస్తే స్టార్ సినిమా రేంజ్ ను కూడా మహానటి దాటేసిందని చెప్పొచ్చు.


పోటీగా సరైన సినిమాలేవి లేకపోవడంతో మహానటి బాక్సాఫీస్ పై సత్తా చాటుతుంది. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వచ్చిన ఈ మహానటి సినిమాను అశ్వనిదత్ సమర్పణలో స్వప్నా, ప్రియాంకా దత్ లు నిర్మించారు. కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ ముఖ్య పాత్రలుగా చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: