అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా చేసుకొని నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’ సినిమాపై ఎన్నో ప్రశంసలు వస్తున్నాయి.  తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో 2 మిలియన్ క్లబ్ లో చేరింది. ప్రస్తుతం టాలీవుడ్ లో రంగస్థలం, భరత్ అనే నేను, నా పేరు సూర్య లాంటి స్టార్ హీరోలతో పోటీ పడుతూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది ‘మహానటి’.  ఈ సినిమా తెరకెక్కించే ముందు నాగ్ అశ్విన్ మహానటి సావిత్రి జీవితంపై ఎంతో రీసర్చ్ చేసి ఆమె బంధువులు, స్నేహితులను సంప్రదించారు.  మహానటి పాత్రలో కీర్తి సురేష్ అద్భుత నటన ప్రదర్శించింది.
Image result for జెమినీ గణేశన్
జెమినీ గణేషన్ గా దుల్కన్ సల్మాన్ కూడా అద్భుతంగా నటించారు.  ఈ సినిమాలో అన్ని పాత్రలు పెద్ద నటులే చేయడం మరో విశేషం. ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్లో సావిత్రి కూతురు  సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి, తనయుడు సతీష్ లు తమ తల్లితో ఉన్న అనుబంధం గురించి వివరించారు.  ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత  సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి సినిమా అద్భుతంగా ఉందని..ఇది అసలైన అమ్మ కథ అంటూ ఖితాబు ఇచ్చారు.  అంతే కాదు నాగ్ అశ్విన్, సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ కి, జెమినీ గణేషన్ పాత్రలో నటించిన దుల్కన్ సల్మాన్ కి అభినందనలు తెలిపారు.
Image result for జెమినీ గణేశన్
తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ‘మహానటి’మంచి రెస్పాన్స్ రావడమే కాదు కలెక్షన్ల పరంగా దూసుకు వెళ్తుంది. తాజాగా ‘మహానటి’ చిత్రాన్ని మరో వివాదం చుట్టిముట్టింది. ఈ చిత్రంలో సావిత్రి పాత్రను హైలైట్ చేస్తూ.. జెమినీ గణేశన్‌ను నెగిటివ్‌గా చూపించారంటూ ఆమె కూతురు కమలా గణేశన్ ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.  తన తండ్రి చనిపోయే వరకు సినిమాల్లో నటించారని..ఎప్పుడూ బిజీగానే ఉన్నారని..ఆయన సినిమాలు లేక ఖాళీగా ఎప్పుడూ లేరని అన్నారు. అంతే కాదు సావిత్రికి జెమినీ మద్యం అలవాటు చేయించాడని అనడం అవాస్తవం అని అన్నారు. 
Image result for ginimi ganeshan daugher kamala vijaya chamundshwari
అయితే కమలా గణేశన్ ఆరోపణలో విభేస్తున్నానన్నారు సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి. నాన్నను ఈ సినిమాలో విలన్‌గా చూపించలేదని.. సావిత్రి కథ జీవిత కథతో తీయడంతో ఆ పాత్రకు ప్రాధాన్యత ఇచ్చారే తప్ప ఇందులో మరో ఉద్దేశం లేదంటూ క్లారిటీ ఇచ్చారామె. ఈ సందర్భంగా మీడియా ఇంటర్వ్యూలో మట్లాడుతూ.. ఈ విషయంలో కమలా గణేశన్ వ్యాఖ్యలతో తాను ఏకీభవించన్నారు.  అక్క (కమలా గణేశన్) ఒక కోణంలో సినిమా చూసి ఉండొచ్చు. చూసిన యాంగిల్‌లో తేడా ఉండటం వల్లే అక్కకు అలా అర్ధమైందన్నారు. అక్కకు అమ్మ అంటే చాలా ఇష్టం.
Image result for maha nati
నాన్నను నెగిటివ్‌గా చూపించారని ఆరోపిస్తుండటాన్నిబట్టి అక్కకు కథ అర్ధం కాలేదోమో అనిపిస్తుంది. ఇదిలా ఉంటే..సావిత్రి లైఫ్ విషాదం కావడానికి ఆమె మద్యానికి అలవాటు కావడమే ప్రధాన కారణం. అయితే ఆమెకు మద్యం అలవాటు చేసింది. ఆమె అలా కావడానికి ప్రధాన కారణం జెమినీ గణేశన్ అని ప్రచారం ఉంది. వీటికి బలాన్ని చేకూర్చుతూ ‘మహానటి’ సినిమాలో కొన్నిసీన్లు ఉన్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: